నిర్మలమ్మ బడ్జెట్; అతి చిన్న స్పీచ్ ఇదే
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. దేశ పద్దును ఆమె 86 నిమిషాల్లో ప్రవేశపెట్టారు. అంటే గంటన్నరలోపే ఆమె బడ్జెట్ ప్రసంగం చేశారు. ఇప్పటివరకు ఆమె 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2020-21 బడ్జెట్ ప్రసంగంలో ఆమె ఏకంగా 162 నిమిషాల పాటు ప్రసంగించింది. ఇదే ఇప్పటివరకు సుదీర్ఘ ప్రసంగంగా ఉంది. ప్రస్తుతం గంటన్నర లోపే ప్రసంగం ముగించి అతి తక్కువ సమయం తీసుకున్న బడ్జెట్ ప్రసంగంగా నిలిచిపోయింది.