• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కేసీఆర్ సభకు నేను రాను; బీహార్ సీఎం నితీశ్

  తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించే సచివాలయ ప్రారంభోత్సవ సభకు తాను రాలేనని బిహార్ సీఎం నితీశ్ కుమార్ తేల్చి చెప్పారు. తనకు చాలా పనులు ఉన్నాయని.. అందుకు సభకు హాజరు కాలేనని పేర్కొన్నారు. తన తరఫున తేజస్వీ యాదవ్ హాజరవుతారని చెప్పారు. కేసీఆర్ సభకు హాజరైనంత మాత్రానా.. కాంగ్రెస్ తమకున్న భాగస్వామ్యానికి వచ్చే నష్టమేమీ లేదని నితీశ్ పేర్కొన్నారు. కాగా ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లో నూతన సెక్రటేరియేట్ ప్రారంభించనున్నారు.

  నితీశ్‌కు కేసీఆర్ ఆహ్వానం పంపలేదా?

  భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభలో కొందరు భాజపాయేతర కూటమికి యత్నిస్తున్న నేతలు లేకపోవటం చర్చకు దారితీసింది. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న బిహార్ సీఎం నితీశ్‌ కుమార్‌ భారాస సభకు రాలేదు. దీనిపై ఆరా తీయగా కేసీఆర్ ఆయనకి ఆహ్వానం పంపలేదని తెలుస్తోంది. నితీశ్‌ తన కూటమిలో కాంగ్రెస్‌ను కలుపుకుంటామని చెప్పడంతో పక్కన పెట్టారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. భాజపా, కాంగ్రెసేతర కూటమికి కేసీఆర్ జై కొడుతున్న నేపథ్యంలో ఆసక్తి కలిగించింది.

  మోదీని జాతిపితగా చూపే కొత్త కుట్ర: నితీశ్

  ప్రధాని మోదీని జాతిపితగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ పేర్కొనడం పట్ల బిహార్ సీఎం నితీశ్‌కుమార్ తప్పుబట్టారు. మోదీ దేశం కోసం ఏం చేశారో చెప్పాలన్నారు. మహత్మగాంధీతో మోదీకి ఏ విషయంలోనూ పోలిక లేదన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్ నుంచి ఎలాంటి సహకారం లేదన్నారు. మోదీ జాతిపిత అంటూ కొత్త కుట్రలు బయల్దేరయని విమర్శించారు. మోదీ హయాంలో దేశం ఏ రంగంలోనూ పురోగతి సాధించలేదని ఆరోపించారు.

  బిహార్‌లో నితీశ్ Vs ప్రశాంత్ కిశోర్

  బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ‘బీజేపీతో నితీశ్ సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఆ పార్టీ ఎంపీ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఉండటమే కారణం’ అని పీకే విమర్శించగా.. పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నట్లు నితీశ్ ఖండించారు. దీనిపై మళ్లీ ట్విటర్‌లో ప్రశాంత్ కిశోర్ రిప్లై ఇచ్చారు. ‘అన్ని వేళలా రెండు మార్గాలు సాధ్యం కాదు. బీజేపీతో సత్సంబంధాలు లేకుంటే మీ పార్టీ ఎంపీని డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి రాజీనామా … Read more

  సోనియాతో నేడు ‘నీలూ’ ద్వయం భేటీ

  భాజపాను గద్దెదించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్.. నేడు సోనియా గాంధీని కలవనున్నారు. ఓ ర్యాలీలో పాల్గొనేందుకు ఈ ‘నీలూ’ ద్వయం దిల్లీ వెళ్లనుంది. అనంతరం సోనియాను కలిసే అవకాశం ఉంది. బీజేపీ సర్కారును గద్దె దించేందుకు అన్ని ప్రతిపక్షాలను కలుపుకుపోవడంపై వీరు చర్చించనున్నారు. రాజకీయ వర్గాల్లో ఈ భేటీ ఆసక్తి రేపుతోంది.

  నితీష్‌తో కలిసి సోనియాను కలుస్తా: లాలూ

  బీహార్ మాజీ ముఖ్యమంత్రి, RJD అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఉమ్మడి ప్రతిపక్షంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామన్నారు. త్వరలోనే బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో కలిసి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తానని తెలిపారు. భారత్ జోడో యాత్ర పూర్తయిన తరువాత రాహుల్‌ను కూడా కలుస్తానని తెలిపిన ఆయన.. బీజేపీ కారణంగానే దేశంలో మత కల్లోలాలు చెలరేగుతున్నాయన్నారు. © ANI Photo © ANI Photo

  ఆ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా

  కేంద్రంలోని భాజపా సర్కారుని గద్దెదించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న నాయకుల జాబితాలో బిహార్ సీఎం నితీశ్ చేరారు. కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటైతే వెనకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తామని పాట్నాలో నితీశ్ హామీ ఇచ్చారు. స్పెషల్ స్టేటస్ అనేది అసాధ్యమేమీ కాదన్నారు. చాన్నాళ్లుగా బిహార్ ప్రత్యేక హోదా కోసం పోరాడుతోంది. తమకు ప్రత్యేక హోదా కల్పిస్తే.. కేంద్రంలో ఉన్న ఏ పార్టీ ప్రభుత్వానికైనా మద్దతు తెలుపుతామని గతంలో నితీశ్ ప్రకటించారు.

  ఆ ద్వయం మళ్లీ వస్తోంది!

  నితీశ్, లాలూ.. బిహార్ రాజకీయాల్లో కురువృద్ధులు. వీరిద్దరూ కలిసి రెండు దశాబ్దాల కిందట ఒక పార్టీ కోసం పనిచేశారు. ఆనాడు ఘన విజయం సాధించారు. ఇప్పుడు మళ్లీ ఒక్కటయ్యారు. అధికార భాజపాపై పోరాడేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలవనున్నారు. దీంతో మరోసారి ఈ ద్వయం విజయభావుటా ఎగరవేయనుందనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఇటీవల కేసీఆర్ బిహార్ పర్యటన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం!

  కేసీఆర్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు: కిషన్ రెడ్డి

  TS:: దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఢిల్లీ, బిహార్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించినా అక్కడ ఎవరు పట్టించుకోలేదన్నారు. దేశానికి నేనే దిక్కు, కల్వకుంట్ల కుటుంబమే దిక్కు అన్నట్లు కేసీఆర్ ప్రచారం ఉందన్నారు. కేసీఆర్ వన్‌సైడ్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. బిహార్‌ సీఎం నితీశ్‌ను బతిమిలాడి కూర్చోమన్నా పదిసార్లు నవ్వి కేసీఆర్ మాటలు వినలేక వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు.

  బీజేపీ వ్య‌తిరేకులం ఏక‌తాటిపై ఉన్నాం: కేసీఆర్

  నేడు తెలంగాణ‌ సీఎం కేసీఆర్ బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌తో ప‌ట్నాలో స‌మావేశ‌మ‌య్యారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి మీడియాతో ముచ్చ‌టించారు. దేశంలో స‌హ‌జ వ‌న‌రులు పుష్క‌లంగా ఉన్నా బాజాపా ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు క‌నీసం తాగునీరు కూడా ఇవ్వ‌డంలేద‌ని కేసీఆర్ మండిప‌డ్డారు. బీజేపీ వ్య‌తిరేకులం అంద‌రం ఏకతాటిపై ఉన్నాం. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎవ‌రు నాయ‌క‌త్వం వ‌హించాలో నిర్ణ‌యం జ‌రుగుతుందని అన్నారు. ఇక నితీశ్ మాట్లాడుతూ..కేసీఆర్ ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించాడు. ఆయ‌న‌తో భాగస్వామ్యం చాలా గొప్ప‌ది అని పేర్కొన్నాడు.