చంద్రగ్రహణం.. మంచికా? చెడుకా?
ఈ ఏడాది నవంబర్ 8న కార్తీక పౌర్ణమి రోజునే చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఈ సందర్భంగా ప్రముఖ పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర శర్మ మాట్లాడుతూ.. చంద్రగ్రహణం ఎంత మాత్రం కీడు చేయదని తెలిపారు. గ్రహణం వల్ల ఆథ్యాత్మిక లాభాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. గ్రహణం సందర్భంగా శుచి, శుభ్రత, స్నానాలు, తర్పణాలు, ఆహార నియమాలు పాటించాలని సూచించారు. మేష రాశి వారు ఈ చంద్రగ్రహణాన్ని చూడకూడదని చెప్పారు. గ్రహణ శాంతి జరిపి.. ధానధర్మాలు చేయాలని తెలిపారు.