• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈ నెల 5న ‘జిన్నా’ ట్రైలర్ రిలీజ్

    మంచు విష్ణు హీరోగా నటించిన ‘జిన్నా’ సినిమా ట్రైలర్ ఈనెల 5న విడుదల కానుంది. ఈ మేరకు చిత్రబృందం ప్రకటించింది. ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై మరింత అంచనాలు పెంచింది. విడుదలైన రెండు పాటలు కూడా శ్రోతలను ఆకట్టుకున్నాయి. కాగా ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి ఇషాన్ సూర్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాను అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.

    ‘యధావిధిగా టీఆర్ఎస్ సమావేశం’

    ఈ నెల 5న జరగాల్సిన టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం యధావిధిగా జరుగుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ భవన్‌లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. విధిగా అందరూ సమావేశానికి హాజరుకావాలని కేసీఆర్ ఆదేశించారు. మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, దసరా పండుగల ప్రభావంతో ఈ సమావేశం రద్దవుతుందని ఊహాగానాలు తలెత్తటంతో సీఎం స్పందించారు.