• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పెరిగిన వంటనూనె ధరలు

    రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా దేశంలో వంట నూనెల ధరలు భగ్గుమంటున్నాయి. గత 10 రోజులుగా ధరలు ఆకాశానికి ఎగురుతున్నాయి. ఈ నెల 1న రూ.138 ఉన్న ‘విజయ’ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌, ఇప్పుడు రూ.155కు పెరిగింది. పల్లీ నూనె రూ.164 నుంచి రూ.168కి పెరిగింది. రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ రూ.122 నుంచి రూ.128కి ఎగబాకింది. రెండు నెలలుగా తగ్గుతూ వచ్చిన పామాయిల్‌ కూడా ఒక్కసారిగా రూ.10 పెరిగింది. ఈ ధరలు మరింత పెరగొచ్చని ఆయిల్‌ఫెడ్‌ అంచనా వేస్తోంది.

    ఫార్చూన్ ఆయిల్ పై లీటరుకు రూ.30 తగ్గింపు

    ప్రముఖ ఫుడ్ మ్యాన్యుఫాక్చరింగ్ కంపెనీ అదానీ విల్మర్ తమ సంస్థ నుంచి వంట నూనెల ధరలు తగ్గించింది. అంతర్జాతీయ మార్కెట్ లో వంటనూనెల ధరలు తగ్గిన నేపథ్యంలో సంస్థ నిర్ణయం తీసుకుంది. కొత్త ధరలతో త్వరలోనే మార్కెట్లోకి స్టాక్ రాబోతోంది. ఫార్చూన్ బ్రాండ్ తో సంస్థ తమ ఉత్పత్తులు విక్రయిస్తోంది. ప్రస్తుతం లీటరకు రూ.195 ఉండగా తగ్గిన ధరలో రూ.165కు రానున్నాయి.

    తగ్గనున్న వంటనూనె ధరలు

    దేశంలో వంట నూనెల ధరలు తగ్గించేలా కేంద్రం చర్యలు చేపట్టింది. 2022-24 ఆర్థిక సంవత్సరాల్లో వంటనూనెల దిగుమతిపై పన్ను విధించబోమని ప్రకటించింది. 20 లక్షల టన్నులను ఆర్థికశాఖ టారిఫ్ రేట్ కోటా కింద పేర్కొంది. కోటా దాటి దిగుమతి చేసుకునే నూనెపై సాధారణ పన్ను వర్తిస్తుందని తెలిపింది. మరోవైపు ఇండోనేషియా పామాయిల్ పై ఎగుమతి నిషేధం ఎత్తివేయడంతో కూడా ధరలు తగ్గాయని అంటున్నారు.