11న పాల్వాయి స్రవంతి నామినేషన్
TS: మునుగోడు ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పాల్వాయి స్రవంతి ఈ నెల 11న నామినేషన్ వేయనున్నారు. గాంధీభవన్లో ముఖ్య నేతల సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అభివృద్ధే ఎజెండాగా ప్రజల్లోకి ప్రచారం కోసం వెళ్తానని అభ్యర్థి స్రవంతి తెలిపారు. ప్రచారానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తారని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో మాణిక్కం ఠాకూర్, రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కాగా, నవంబరు 3న పోలింగ్ జరగనుంది.