మెట్రో పార్కింగ్ కష్టాలు
హైదరాబాద్ లో సాఫీగా ప్రయాణం చేసేందుకు మెట్రో సౌకర్యాన్ని వినియోగించుకుంటున్న లక్షలాది మంది ప్రజలకు పార్కింగ్ సౌకర్యం ఇబ్బంది పెడుతోంది. ప్రాజెక్టు పూర్తయ్యి ఐదేళ్లు గడిచినా ఇప్పటివరకు సరైన పార్కింగ్ కల్పించలేదు. మియాపూర్, అమీర్ పేట్, ఉప్పల్, నాగోల్, ప్యారడైజ్, ఎంజీబీఎస్ వద్ద మాత్రమే సదుపాయం ఉంది. అది కూడా డబ్బులు చెల్లించాలి. సమస్యను పరిష్కరించేందుకు స్మార్ట్ పార్కింగ్ పేరుతో ప్రైవేటు కంపెనీలతో ఒప్పందం కుదిరినా అడుగు ముందుకు పడలేదు.