• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • యాంకర్ రష్మీ ఇంట విషాదం

  జబర్దస్త్ యాంకర్, హీరోయిన్ రష్మీ గౌతమ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రష్మీ అమ్మమ్మ ప్రమీలా మిశ్రా కన్నుమూశారు. ఈ విషయాన్ని రష్మీ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. బరువెక్కిన గుండెతో ఆమెకు కడసారి వీడ్కోలు పలికామని ఎమోషనల్ ట్వీట్ చేసింది. ‘‘ప్రమీలా మిశ్రా ఉక్కు మహిళ. ఆమె ప్రభావం మాపై ఎంతో ఉంది. ఆమె జ్ణాపకాలు ఎప్పుడూ మాతోనే ఉంటాయి. ఓంశాంతి.’’ అంటూ భావోద్వేగానికి గురైంది. కాగా రష్మి రీసెంట్‌గా ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ మూవీతో వెండితెరపై తళుక్కుమంది.

  కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత

  కేంద్ర మాజీ మంత్రి, ఎల్జేడీ అధినేత శరద్ యాదవ్ (75) గురువారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈక్రమంలో గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శరద్ యాదవ్ బిహార్‌లోని మాధేపురా స్థానం నుంచి ఏకంగా 10 సార్లు లోక్‌సభకు ఎంపికయ్యాడు. జయప్రకాశ్ నాయుడికి శిష్యుడిగా మారి సోషలిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1997లో ఆయన జేడీయూ స్థాపించి.. దానిని వీడి 2018లో ఎల్జేడీని స్థాపించారు.

  మాజీ పోప్ బెనెడిక్ట్ 16 అస్తమయం

  రోమన్ క్యాథలిక్కుల మత గురువు, మాజీ పోప్ బెనెడిక్ట్ 16 (95) శనివారం వాటికన్ సిటీలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. ఈయన అసలు పేరు జోసెఫ్ రాట్జింగర్. దాదాపు దశాబ్దం కిందట ఆయన పోప్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అకస్మాత్తుగా ఆయన పోప్ బాధ్యతల నుంచి తప్పుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. ఇక అప్పటినుంచి బెనెడిక్ట్ 16 వాటికన్ గ్రౌండ్స్‌లోని కాన్వెంట్లో జీవిస్తున్నారు. వాటికన్‌లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

  పీలేకు మెస్సీ, రొనాల్డోల నివాళి

  బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే మృతితో ఫుట్‌బాల్ ప్రేమికులు విషాదంలో మునిగిపోయారు. పీలే మృతికి ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాళ్లు లియోనల్ మెస్సీ, క్రిస్టియానా రోనాల్డో నివాళులర్పించారు. కైలియన్ ఎంబాపే, సెర్గియా రామోస్, మెసుట్ ఓజిల్ వంటి సాకర్ ఆటగాళ్లు సంతాపం తెలిపారు. కాగా పీలే (82) గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతూ కన్నుమూశారు. పీలే రెండు దశాబ్దాల పాటు ఫుట్‌బాల్ అభిమానులను ఉర్రూతలూగించారు.

  అస్తమించిన లెజండరీ టెన్నిస్ కోచ్

  లెజండరీ టెన్నిస్ కోచ్ నిక్ బొల్లెట్టిరి (91) అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ మేరకు ఆయన స్థాపించిన ఐఎంజీ ప్రకటించింది. విషయం తెలుసుకున్న అభిమానులు, టెన్నిస్ మాజీ క్రీడాకారులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. కాగా ఐఎంజీ అకాడమీలో ఆండ్రీ అగస్సీ, మారియా షరపోవా, సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ లాంటి దిగ్గజాలు శిక్షణ తీసుకున్నారు. టాప్10 ర్యాంకింగ్స్‌లో కొనసాగిన ఆటగాళ్లందరూ ఏదో ఒక సమయంలో ఆయన దగ్గర శిక్షణ తీసుకున్నవారే.

  విషాదం.. క్యాన్సర్‌తో నటి కన్నుమూత

  హాలీవుడ్ నటి కిర్ట్సీ అల్లీ (71) క్యాన్సర్‌ వ్యాధితో కన్నుమూశారు. ఆమెకు క్యాన్సర్ సోకినట్లుగా ఇటీవల తెలిసింది. అప్పటినుంచి ఆమె క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కిర్ట్సీ అల్లీ కుటుంబసభ్యులు ఆమె చనిపోయినట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా కిర్ట్సీ అల్లీ ‘చీర్స్’ ‘డ్రాప్ డెడ్ గార్జియస్’ వంటి పలు హాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించారు. పలు టీవీ షోలు, కామిక్ షోలకు ఆమె పనిచేశారు. ఆమె మృతిపట్ల పలువురు సెలబ్రిటీలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

  ‘రస్నా’ వ్యవస్థాపకుడు ఫిరోజ్ కన్నుమూత

  సాఫ్ట్ డ్రింక్ ‘రస్నా’ వ్యవస్థాపకుడు అరీజ్ ఫిరోజ్ షా ఖంబట్టా (85) గుండెపోటుతో కన్నుమూశారు. కూల్ డ్రింక్స్ రేట్లు పెరుగుతున్న క్రమంలో ప్రజలకు ఉపశమనంగా అరీజ్ ఫిరోజ్ ‘రస్నా’ను ప్రవేశపెట్టారు. తొలుత ఆరెంజ్ ఫ్లేవర్‌తో మార్కెట్‌లోకి వచ్చిన ఈ సాఫ్ట్ డ్రింక్.. తర్వాత వివిధ రకాల ఫ్లేవర్లతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. రూ.5 రస్నా ప్యాకెట్‌తో 32 గ్లాసుల డ్రింక్ తయారు చేసుకునేలా ఈ ప్రోడక్ట్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం రస్నా 60 దేశాల్లో అందుబాటులో ఉంది. ©RASNA © RASNA Courtesy Twitter: … Read more

  ‘ఆ నలుగురు’ డైరెక్టర్ మదన్ హఠాన్మరణం

  ‘ఆ నలుగురు’ సినిమా డైరెక్టర్ మదన్ హఠాన్మరణం చెందారు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శనివారం హఠాత్తుగా మరణించారు. మదన్ ‘పెళ్లైన కొత్తలో’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘ఆ నలుగురు’ చిత్రంతో టాలీవుడ్‌లో తన సత్తా చాాటారు.ఇండస్ట్రీలో ఎస్ గోపాల్ రెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత దర్శకుడిగా మారి పలు చిత్రాలు నిర్మించారు. కాగా మదన్ స్వస్థలం ఏపీలోని మదనపల్లె.

  ప్రముఖ నటి హఠాన్మరణం

  ప్రముఖ బాలీవుడ్ నటి తబుస్సుమ్ గోవిల్ (78) హఠాన్మరణం చెందారు. ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. కాగా తబుస్సుమ్ ముంబైలో జన్మించింది. బాలీవుడ్‌లో బేబీ తబుస్సుమ్‌గా పేరుగాంచింది. ఆమె తన సినీ కెరీర్‌ను చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రారంభించింది. తబుస్సుమ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలువురు బాలీవుడ్ ప్రముఖ నటులతో కలసి నటించింది. దాదాపు 20 ఏళ్ల పాటు దూరదర్శన్ తొలి సెలబ్రిటీ టాక్ షో ‘పూల్ ఖిలే హై గుల్షన్ గుల్షన్’ కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.

  ప్రపంచంలోనే వృద్ధ శునకం మృతి

  ప్రపంచంలోనే ఎక్కువ కాలం బతికిన కుక్క మరణించింది. అమెరికాలోని సౌత్ కరోలినాలో ఉండే ‘పెబుల్స్’ అనే శునకం దాదాపు 22 సంవత్సరాలు జీవించి గురువారం చనిపోయింది. సాధారణంగా కుక్కలు 10-13 సంవత్సరాలు మాత్రమే బతుకుతాయి. కానీ ఈ కుక్క ఏకంగా 22 ఏళ్లు ఈ భూమిపై బతికి గిన్నిస్ రికార్డు కూడా సృష్టించింది. ఈ కుక్క ఇప్పటివరకు 32 కుక్కపిల్లలకు జన్మనిచ్చింది.