కాంగ్రెస్‌వి డర్టీ పాలిటిక్స్; బొమ్మై
రాష్ట్రంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ డర్టీ పాలిటిక్స్ చేస్తోందని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై మండిపడ్డారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆయన ఆరోపించారు. అంతిమంగా సత్యమే గెలుస్తుందని బొమ్మై అభిప్రాయపడ్డారు. కాగా ఇటీవల ‘పేసీఎం’ అంటూ బెంగళూరు అంతటా పోస్టర్లు వెలసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ల క్యాంపెయిన్‌ను కాంగ్రెస్ పార్టీనే చేపట్టిందనే ఆరోపణలతో పలువురు కాంగ్రెస్ నేతలను అరెస్టులు కూడా చేశారు.