• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • HYDలో ఉగ్రదాడికి కుట్ర

    TS: HYDలో మరోసారి ఉగ్రదాడికి కుట్ర జరిగింది. ముందస్తు సమాచారంతో పోలీసులు ఈ కుట్రను భగ్నం చేశారు. సభలపై గ్రనేడ్లు విసిరి మతపరమైన ఉద్రిక్తతలకు దారితీయాలని కుట్ర పన్నినట్లు సమాచారం. దీంతో ముసారాంబాగ్‌లో నివాసముంటున్న జాహెద్‌తో పాటు మరో మరో ఇద్దరు అరెస్టయినట్లు తెలుస్తోంది. వీరి వద్ద నుంచి హ్యాండ్ గ్రనేడ్లు, డబ్బును స్వాధీనం చేసుకున్నారు. బేగంపేట బ్లాస్ట్ కేసులో జాహెద్‌ నిందితుడు. ఇతడికి ఐఎస్ఐతో కనెక్షన్ ఉన్నట్లు సమాచారం.

    PFIపై ఐదేళ్ల పాటు నిషేధం

    పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI)కు కేంద్రం షాకిచ్చింది. ఆ సంస్థను 5 ఏళ్లపాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పీఎఫ్ఐతో పాటు మరో 8 అనుబంధ సంస్థలపై నిషేధం విధిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పీఎఫ్ఐ సంస్థ ఉగ్రసంస్థలతో సంబంధాలు ఉన్నాయని NIA విచారణలో తేలింది. ప్రధాని మోదీ హత్యకు కూడా పీఎఫ్ఐ సంస్థ కుట్ర పన్నినట్లు అభియోగాలు ఉన్నాయి. దీంతో ఆ సంస్థపై తాజాగా కేంద్రం నిషేధం విధించింది.

    ప్రధాని మోదీ హత్యకు కుట్ర

    ప్రధాని మోదీ హత్యకు పీఎఫ్ఐ సంస్థ కుట్ర పన్నినట్లు NIA విచారణలో తేలింది. గతేడాది ప్రధాని బిహార్ పర్యటన సందర్భంగా ఆయనపై దాడికి కుట్ర పన్నినట్లు తెలిసింది. ప్రధాని సహా యూపీలోని పలువురు నేతలపై దాడులకు కుట్రపన్నినట్లు తెలిసింది. పీఎఫ్ సంస్థకు పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు నిర్ధరించారు. ఉగ్రకార్యకలాపాలకు ఈ సంస్థ నిధులు సమకూర్చినట్లు కూడా విచారణలో తేలింది. ఇటీవల ఈ కేసులో అరెస్ట్ అయిన వారని నుంచి తాజా సమాచారని అధికారులు సేకరించారు.

    కేరళలో PFI జగడం

    అతివాద ఇస్లామిక్‌ సంస్థ PFIపై NIA దాడులను నిరసిస్తూ కేరళలో ఆ సంస్థ చేపట్టిన ధర్నా(హర్తాల్‌) హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ బస్సులు, పోలీసు వాహనాలపై దాడులు చేశారు. పెట్రోల్‌ బాంబులు కూడా విసిరినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. గొడవల్లో 15 ఏళ్ల బాలిక, ఓ ఆటో డ్రైవర్‌ గాయపడ్డారు. హింసాత్మక పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ రాష్ట్ర హైకోర్టు, కేసును సుమోటోగా స్వీకరించింది. ముందస్తు సమాచారం లేకుండా ధర్నాకు దిగిన … Read more

    దేశవ్యాప్తంగా 106 మంది అరెస్టు

    ఉగ్రవాద లింకులపై దేశవ్యాప్తంగా జరిపిన తనిఖీల్లో 106 మంది అరెస్టైనట్లు అధికారులు వెల్లడించారు. 15 రాష్ట్రాల్లో పాపులర్ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(PFI) కార్యాలయాలపై అధికారులు దాడులు చేశారు. 93 ప్రాంతాల్లో 106 గురిని అరెస్ట్‌ చేశారు. ఇందులో జాతీయ దర్యాప్తు సంస్థ-NIA 45 మందిని అరెస్ట్ చేసింది. కేరళలో 19, తమిళనాడులో 11, కర్ణాటకలో 7, ఆంధ్రప్రదేశ్‌లో 4, రాజస్థాన్‌లో 2, యూపీలో ఒకరు, తెలంగాణలో ఒకరిని NIA అదుపులోకి తీసుకుంది. ఇప్పటిదాకా PFIపై కేసు నమోదు చేయలేదని అధికారులు తెలిపారు.

    హైదరాబాద్ PFI కార్యాలయం సీజ్

    హైదరాబాద్‌లోని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI) కార్యాలయాన్ని NIA సీజ్ చేసింది. ఉగ్రవాద అనుకూల కార్యక్రమాలకు పాల్పడుతుందన్న ఆరోపణలపై EDతో కలిసి NIA దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తోంది. ఈ సంయుక్త దాడుల్లో అనుమానితులను అదుపులోకి తీసుకుంటోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ చాంద్రాయణగుట్టలోని కార్యాలయానికి స్థానిక పోలీసుల సహాయంతో సీల్ వేసింది. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రధాన నగరాల్లో NIA సోదాలు చేస్తోంది.

    తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు

    ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారన్న ఆరోపణలతో తెలుగు రాష్ట్రాల్లోని పలు మతపరమైన సంస్థల్లో ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. నేడు తెల్లవారుజాము నుంచి హైదరాబాద్, కరీంనగర్, కర్నూలు, నిజామాబాద్, ఆదిలాబాద్‌లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఉగ్రవాద అనుకూల చర్యలకు పాల్పడటంపై అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు, దేశవ్యాప్తంగా జరిపిన సోదాల్లో 100మంది పీఎఫ్ఐ ముఖ్యులను ఎన్ఐఏ అరెస్టు చేసింది.

    తెలంగాణలో నలుగురు పీఎఫ్‌ఐ కార్యకర్తలు అరెస్ట్‌

    తెలుగు రాష్ట్రాల్లో ఉగ్ర సంబంధాలపై విస్తృతంగా సోదాలు జరిపిన జాతీయ దర్యాప్తు సంస్థ-NIA నలుగురు నిందితులను అరెస్ట్ చేసింది. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, శామీర్‌పేట, కరీంనగర్‌లో సమీర్‌, ఫిరోజ్‌ఖాన్‌, మహమ్మద్‌ ఉస్మాన్‌, ఇర్ఫాన్‌లను NIA అదుపులోకి తీసుకుంది. వీరు తెలుగు రాష్ట్రాల్లో మూక విధ్వంసానికి కుట్ర చేసినట్లు తెలిసింది. జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆందోళనలు సృష్టించేందుకు వీరు కుట్రపన్నారు. ఆదివారం ఉదయం నుంచి NIA, నిజామాబాద్‌, జగిత్యాల, బైంసాతో పాటు ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో తనిఖీలు జరిపింది. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా … Read more