ఎమ్మెల్యేల కొనుగోలుపై ప్రకాశ్ రాజ్ ఘాటు స్పందన
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఘాటుగా స్పందించారు. దిల్లీ నుంచి వచ్చిన సిగ్గులేని బ్రోకర్లు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ప్రకాశ్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టినవారు ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని వేలం వేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై గురువారం ప్రెస్మీట్ నిర్వహించిన సీఎం కేసీఆర్…దేశాన్ని బీజేపీ నాశనం చేస్తోందని విమర్శించిన విషయం తెలిసిందే.