• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. పోలీసుల దర్యాప్తునకు గ్రీన్ సిగ్నల్

    టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తును నిలిపివేయాలంటూ గతంలో దాఖలైన పిటీషన్‌ను కొట్టివేసింది. మొయినాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేయవచ్చంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి కేసుల్లో దర్యాప్తు వేగంగా జరగాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసు విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. హైకోర్టు స్టే ఎత్తివేయడంతో నిందితులు పోలీసుల కస్టడీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

    సోనాలి ఫోగట్ డైరీలో వారి పేర్లు?

    బీజేపీ నేత, టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగట్ డైరీలో రాజకీయ నేతలు, కార్యకర్తల పేర్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ ఇచ్చి ఆమెను హత్య చేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో పోలీసులకు కీలక విషయాలు తెలుస్తున్నాయి. ఆమె ఫామ్ హౌస్ లోని కార్లు, విలువైన వస్తువులు మాయమయ్యాయి. వీటిని వెతికే పనిలో పోలీసులు పడ్డారు. ప్రధాన నిందితుడైన సుధీర్.. ఆమె ఆస్తిపై కన్నేసినట్లు గుర్తించారు. అయితే, డైరీలో లభ్యమైన రాజకీయ నేతల పేర్లను పోలీసులు వెల్లడించలేదు.