‘మిస్ యూ విరాట్ కోహ్లీ’.. పోస్టర్ వైరల్
వెస్టిండీస్, ఇండియా మధ్య జరిగిన రెండో వన్డేలో టీమిండియా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్కు సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. అయితే నిన్న జరిగిన మ్యాచ్లో స్టేడియంలో ఓ అభిమాని మిస్ యూ విరాట్ కోహ్లీ అనే పోస్టర్ ప్రదర్శించాడు. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న కోహ్లీకి మద్దతుగా.. ‘ఒన్స్ ఏ కింగ్, ఆల్వేస్ ఏ కింగ్’ అంటూ ఆ పోస్టర్లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతోంది.