కరీంనగర్లో భాజపా భారీ బహిరంగ సభ
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర నేటితో ముగియనుంది. కరీంనగర్లో భారీ బహిరంగ సభ ద్వారా యాత్రను ముగించనున్నారు. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 17 వరకు చేయాలని అనుకున్నప్పటికీ రెండ్రోజుల ముందే ఆపేస్తున్నారు. SRR కళాశాలలో నిర్వహించే బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నారని తెలుస్తోంది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా పాల్గొంటారు.అనంతరం శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని సమాచారం.