కాంగ్రెస్ పార్టీకి నా అవసరం లేదు: ప్రశాంత్ కిషోర్
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని వార్తలు హల్చల్ చేశాయి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కూడా అతనికి పలు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తరువాత పార్టీ అభ్యర్థనను తాను సున్నితంగా తిరస్కరిస్కరించానని, పార్టీలో చేరడం లేదని పీకే ప్రకటించారు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీకి తన అవసరం లేదని ప్రకటించారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరిగి పుంజుకునే శక్తి ఉందని పేర్కొన్నారు.