USA ప్రిమియర్స్ బుకింగ్స్‌లో ‘లైగర్’ జోరు
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘లైగర్’ మూవీకి ఓవర్సీస్లో భారీ క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే ప్రీమియర్స్ కోసం ప్రీ-బుకింగ్ సేల్స్ 10K డాలర్స్ నమోదయ్యాయి. దీంతో మొదటిరోజు అమెరికాలో కలెక్షన్లు దుమ్ములేపుతాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. లైగర్ మొత్తం థియేట్రికల్ బిజినెస్ రూ.90 కోట్లు. మరి సినిమా ఎంతమేరకు రాబడుతుందోనని ఎదురుచూస్తున్నారు. మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన పాటలు, ట్రైలర్లు అంచనాలను పెంచుతున్నాయి. లైగర్ ఆగస్ట్ 25న థియేటర్లలో విడుదల కాబోతుంది.