ఇలా చేస్తే బ్యూటీపార్లర్ స్ట్రోక్ రాదట
బ్యూటీ పార్లర్లో హెయిర్ వాష్ చేయించుకంటూ స్ట్రోక్తో మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ స్ట్రోక్ మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు ఉన్నవారికి వచ్చే అవకాశం ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యవంతులకు కూడా అటాక్ కావొచ్చంటున్నారు. ఈ స్ట్రోక్ నుంచి తప్పించుకోవడానికి ఈ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. చల్లని నీటికి బదులు గోరువెచ్చని నీటితో వాష్ చేయించుకోవాలి. మెడ నరాలపై ఒత్తిడి కలగకుండా చూడాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి.