కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎన్నికలు వాయిదా!
జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎంచుకునేందుకు జరగనున్న ఎన్నికలు వాయిదాపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్నివారాల పాటు వీటిని వాయిదా వేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల ఫైనల్ షెడ్యూల్ ఆగస్ట్ 28న జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్లో నిర్ణయించనున్నారు. ఈసారి ఎలాగైనా రాహుల్ గాందీని ఒప్పించి అధ్యక్షుడిగా ఉండాలని కోరేందుకు సీనియర్లు సిద్ధమవుతున్నారు. ఇంతకుముందు చాలాసార్లు దీన్ని తిరస్కరించిన రాహుల్ ఇప్పుడు కూడా అంగీకరిస్తాడో లేదోనన్న సందేహాలూ ఉన్నాయి. ప్రస్తుతం సోనియా గాందీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతుంది.