సింగపూర్ చేరుకున్న శ్రీలంక మాజీ అధ్యక్షుడు..ఓ వైపు కర్ఫ్యూ !
శ్రీలంకలో నిరనలు కొనసాగుతున్న వేళ గురువారం ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు కొలంబోలో నిరసనకారులు ప్రధాని రణిల్ కార్యాలయాన్ని ముట్టడించగా ఒకరు మృతి చెందారు. ఇక మాజీ అధ్యక్షుడు గోటబాయ రాజపక్సే మాల్దీవులకు పారిపోయారు. అక్కడి నుంచి సింగపూర్‌కు చేరుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే జూలై 13న తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించి చెప్పకుండానే గోటబాయ వెళ్లిపోయారు. దీంతో తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణిల్ విక్రమసింఘే బాధ్యతలు స్వీకరించారు.