గిల్, పృథ్వీపై గంభీర్ కీలక వ్యాఖ్యలు
టీమిండియా యువ క్రికెటర్లపై మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డేలకు శుభమన్ గిల్.. టీ20లకు పృథ్వీ షా సరిగ్గా సరిపోతారని అన్నాడు. “ స్పిన్ బౌలింగ్‌లో గిల్ ఇంకా ఆడాల్సిన అవసరం ఉంది. అలాంటి పిచ్‌లపై అతడు ఇబ్బంది పడుతున్నాడు. కానీ, 50 ఓవర్ల క్రికెట్లో ఆటతీరు అద్భుతం. బంతి తిరగటం, బౌన్స్ అయినప్పుడు బ్యాటర్‌కు అసలైన పరీక్ష. శుభమన్ టీ20లు ఆడలేకపోతున్నాడు. ఈ ఫార్మాట్‌కు పృథ్వీ షా సరిగ్గా సరిపోతాడు” అన్నారు.