రాధికా ఆప్టే సెకండ్ ఇన్నింగ్స్; డైరెక్టర్గా ఎంట్రీ!
హీరోయిన్ రాధికా ఆప్టే నటనకు స్వస్తి పలికి మెగా ఫోన్ పట్టనుందని సమాచారం. రాధికా దృష్టి ఇప్పుడు దర్శకత్వంపై పడింది. ఒక ఇంటర్వ్యూలో రాధికా మాట్లాడుతూ ‘‘తొలుత డైరెక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యాను. డైరెక్షన్ విభాగంలో శిక్షణ కూడా పొందా. ప్రస్తుతం ఇతర డైరెక్టర్ల వద్ద కొన్ని రోజులు శిక్షణ తీసుకుంటా. అదే సమయంలో కొన్ని కథలు కూడా సిద్ధం చేసుకుంటా. కానీ నటనకే నా తొలి ప్రాధాన్యత.’’ అంటూ ఈ బోల్డ్ బ్యూటీ చెప్పుకొచ్చింది.