• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఐసీసీకి ఇంగ్లీష్‌లో సమాధానం ఇస్తా’

    వరల్డ్ కప్‌లో టీమ్‌ఇండియా ఆడిన నాలుగు మైదానాల్లో రెండింటికి ICC కాస్త తక్కువ రేటింగ్‌ ఇచ్చింది. దీనిపై భారత ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. ‘నాకు ఐసీసీ పట్ల గౌరవం ఉంది. అయితే ఇలా రేటింగ్ ఇవ్వడం ఆమోదయోగ్యం కాదు’ అని హిందీలో పేర్కొన్న ద్రవిడ్‌ వెంటనే ‘ఇలాంటి వాటికి ఇంగ్లీష్‌లోనే సమాధానం ఇస్తా’ అన్నాడు. ‘పిచ్‌ స్పందించిన తీరే కాకుండా ఆటగాళ్ల నైపుణ్యాలనూ పరిశీలించాలి. కేవలం ఫోర్లు, సిక్స్‌లు మాత్రమే చూస్తామంటే కుదరుదు. అలా అనుకుంటే టీ20 వికెట్లను తయారు చేసుకోవచ్చు’ … Read more

    వరల్డ్‌ కప్‌ టీం సిద్ధమైంది: కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌

    వన్డే వరల్డ్‌ కప్‌ కోసం ఇప్పటికే 17-18 మంది ప్లేయర్ల జాబితాను సిద్ధం చేశామని టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్ తెలిపారు. వరల్డ్ కప్‌నకు ముందే పలు కాంబినేషన్లు ట్రై చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే తాము కొంతమంది ప్లేయర్ల పేర్లు సిద్ధంగా ఉంచుకున్నామని, గాయపడిన ఆటగాళ్ల ఫిట్‌నెస్ ఆధారంగా తుది నిర్ణయానికి వస్తామన్నారు. అయితే గాయాల వల్ల జట్టుకు మరీ ఇబ్బంది లేదని, ఇప్పటికీ జట్టు బాగానే ఉందని ద్రావిడ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రపంచకప్‌ జరగనుంది. … Read more

    చరిత్రలో మరపురాని రోజు ఇది: ద్రవిడ్

    అండర్-19 ప్రపంచకప్ గెలిచిన మహిళా క్రికెటర్లకు టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ శుభాకాంక్షలు తెలియజేశాడు. చరిత్రలో ఇదొక మరపురాని రోజు అంటూ ద్రవిడ్ ప్రశంసించాడు. ఈ సందర్భంగా వారికి సందేశం అందించాలని 2018 అండర్-19 విన్నింగ్ కెప్టెన్ పృథ్వీ షాకు మైక్ అప్పజెప్పాడు. ఇదొక గొప్ప విజయమని పృథ్వీ షా చెప్పాడు. ‘ఈ గెలుపుని సాధించినందుకు ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మీకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారు’ అని అండర్-19 మహిళా క్రికెటర్లకు షా సందేశమిచ్చాడు. 2018లోనూ పృథ్వీ షా నేతృత్వంలో భారత్ టైటిల్ నెగ్గింది. … Read more