• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బంగ్లాదేశ్‌ పసికూన: రాహుల్‌ ద్రవిడ్‌

  భారత్‌ ప్రపంచకప్‌ గెలిచేందుకు వస్తే…తాము టీమిండియాను ఓడించేందుకు వచ్చామన్న బంగ్లా కెప్టెన్‌ షకీబ్ అల్‌ హసన్‌ వ్యాఖ్యలపై ద్రవిడ్‌ ఘూటుగా స్పందించారు. ఇప్పటివరకు ప్రపంచకప్‌ చరిత్రలో భారత్‌పై బంగ్లాదేశ్‌ గెలిచింది లేదన్నారు. ఇద్దరి మధ్య 11 టీ ట్వంటీ మ్యాచ్‌లు జరిగితే కేవలం ఒకదాంట్లో నెగ్గారని పేర్కొన్నారు. ఆడిలైడ్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతుండగా..ఇద్దరికీ కీలకం కానుంది. రెండు జట్లు నాలుగు పాయింట్లతో సమానంగా ఉన్నాయి.

  బుమ్రా కోసం చూస్తున్నాం: ద్రవిడ్

  బుమ్రా ఫిట్‌నెస్‌పై టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. ‘ప్రస్తుతానికి బుమ్రా అకాడమీలో ఉన్నాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌కు మాత్రమే అతడు దూరమయ్యాడు. వైద్యబృందం బుమ్రా గాయాన్ని పరిశీలిస్తోంది. రెండు,మూడు రోజుల్లో ఏం జరగబోతోందో వేచి చూడాలి. అధికారికంగా ప్రపంచకప్ నుంచి బుమ్రా వైదొలగలేదు. మంచి జరుగుతందనే ఆశిద్దాం’ అని ద్రవిడ్ చెప్పాడు. అయితే, బుమ్రా టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యా డని వచ్చిన వార్తలని గంగూలీ కొట్టివేసిన సంగతి తెలిసిందే.

  గెలిచినా, ఓడినా ఇలానే ఆడతాం

  గెలిచినా, ఓడినా.. ఒకేలా ఆడేందుకు ప్రయత్నిస్తామని టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశారు. కోచ్ గా తన పాత్ర ఏంటో తనకు తెలుసునని నొక్కి చెప్పారు. కెప్టెన్ కు, జట్టు సభ్యులకు మద్దతు ఇవ్వడమే తన పని అని చెప్పారు. ప్లేయర్ల నుంచి ఉత్తమ ప్రతిభను వెలికితీసేందుకు ప్రయత్నిస్తానన్నారు. మైదానంలో నిర్ణయాలపై తనకు నియంత్రణ లేదన్నారు. గెలుపోటముల గురించి తలలు పట్టుకోమని ద్రవిడ్ చెప్పారు.

  అందుకే ద్రావిడ్‌ను క్రికెట్ జెంటిల్‌మెన్ అనేది !

  టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌పై ద్రావిడ్ స్పందింస్తూ పాకిస్థాన్ బౌలింగ్‌ను ప్రశంసించాడు. ఆ క్రమంలోనే ద్రావిడ్ ‘సెక్సీ’ అనే పదాన్ని పలకబోయి.. ఆ పదాన్ని ఇక్కడ వాడాలని అనుకోవట్లేదు అని మాట దాటేశాడు. విలేఖర్లు ఆ పదం ఏంటని ప్రశ్నించగా.. అదొక నాలుగు అక్షరాల పదం ‘S’తో స్టార్ట్ అవుతుంది చెప్పాడు.

  దుబాయికి చేరుకున్న రాహుల్ ద్రావిడ్

  టీమిండియా ఫ్యాన్స్‌కు బీసీసీఐ గుడ్‌ న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా ఆసియా కప్‌కు దూరమవుతాడునుకున్న హెడ్‌ కోచ్ రాహుల్ ద్రావిడ్ అందుబాటులోకి వచ్చాడు. ఈమేరకు రాహుల్ ద్రావిడ్ దుబాయి చేరుకున్నట్లు బీసీసీ అధికారికంగా తెలిపింది. అతనికి జరిపిన కోవిడ్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని వెల్లడించింది. ఈక్రమంలో సాయంత్రం జరిగే ఇండియా- పాక్ మ్యాచ్‌కు ద్రావిడ్‌ అందుబాటులోకి రానున్నాడు. వారం రోజుల క్రితం ద్రావిడ్‌కు కరోనా సోకింది.ఈనేపథ్యంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను బీసీసీఐ తాత్కాలిక కోచ్‌గా నియమించింది.

  రాహుల్ ద్రావిడ్‌కు కోవిడ్.. ఆసియా కప్‌కు దూరం?

  ఆసియాకప్ టోర్నికి ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ద్రావిడ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. మరో నాలుగు రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈనెల 28న పాకిస్థాన్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇలాంటి సమయంలో ప్రధాన కోచ్ లేకపోవడం కలవర పరుస్తోంది. అయితే మ్యాచ్ నాటికి ద్రావిడ్ కోలుకుని అందుబాటులో ఉంటారని బీసీసీ అధికారులు చెబుతున్నారు.

  రాహుల్ ద్రవిడ్‌పై రాస్ టేలర్ ప్రశంసల జల్లు

  ఇటీవల ఐపీఎల్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన న్యూజిలాండ్ మాజీ క్రికెటర్‌ రాస్ టేలర్‌.. భారత మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘ప్రపంచ వ్యాప్తంగా 4000కు పైగా పులులు ఉన్నాయి కానీ, రాహుల్ ద్రవిడ్ మాత్రం ఒక్కడే ఉన్నాడు’ అని వ్యాఖ్యానించాడు. ఇటీవల తన ఆత్మకథను విడుదల చేసిన రాస్ టేలర్‌…తాను డకౌట్ అయినపుడు రాజస్థాన్‌ టీం యజమాని తనను కొట్టాడని చెప్పిన విషయం తెలిసిందే. Twitter:ross taylor © ANI Photo

  3 రోజులు బాగా ఆడాం: ద్రావిడ్

  ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా ఓటమిపై కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్పందించారు. ‘మేం మొదటి 3 రోజులు బాగా ఆడినా రెండో ఇన్నింగ్స్‌లో సరిగ్గా ఆడలేకపోయాం. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లో విఫలమయ్యాం. మ్యాచ్‌ గెలవాలన్న కసిని కొనసాగించలేకపోయాం. ఇంగ్లాండ్‌ బాగా ఆడి మ్యాచ్ గెలిచింది. రూట్‌, బెయిర్‌స్టో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు’ అని ద్రవిడ్‌ వివరించాడు.

  విరాట్ కోహ్లీకి కరోనా పాజిటివ్?

  ఇంగ్లాండ్ వెళ్లిన ఇండియా జట్టుకు కరోనా కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే బౌలర్ అశ్విన్ కు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. తాజాగా విరాట్ కోహ్లీకి కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఇంగ్లాడ్ లో ఉన్న విరాట్ షాపింగ్ కోసం పలు ప్రాంతాలకు వెళ్లినట్లు తెలిసింది. ఈ క్రమంలో కరోనా సోకి తగ్గిందని అనిమానిస్తున్నారు. అయితే గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడిన 5వ టెస్టు జూలై 1 నుంచి 5 వరకు జగనుంది. ఇక మ్యాచ్ జరిగే వరకు ఎంత మందికి కరోనా … Read more

  భార‌త ఆట‌గాళ్ల‌కు గాయాలు.. ద్రవిడ్‌ మాస్టర్‌ ప్లాన్‌

  ఈ ఏడాది టీ20 వరల్డ్‌ కప్‌, వ‌చ్చే సంవత్సరం వన్డే ప్రపంచకప్‌ జరుగనుంది. అయితే మెగా టోర్నీల‌కు ముందు టీమిండియా కీల‌క‌ ఆట‌గాళ్లు గాయాల‌బారిన ప‌డుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇప్ప‌టికే దీప‌క్ చాహ‌ర్, భువీ, సూర్య‌కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాతో పాటు మ‌రికొంద‌రు క్రికెట‌ర్లు గాయాల‌ పాలై జాతీయ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ)లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌ట్టు కోచ్ రాహుల్ ద్ర‌విడ్ కీల‌క‌ నిర్ణ‌యం తీసుకున్నారు. టీమిండియా ప్ర‌స్తుత ఫిజియో నితిన్ ప‌టేల్ ను ప్ర‌మోష‌న్ ఇచ్చి ఎన్‌సీఏకు పంపాల‌ని యోచిస్తున్నార‌ట‌. ఈ … Read more