• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘KCR దోచుకున్నదంతా పేదలకు పంచుతాం’

    TG: బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజల కలలన్నీ నిర్వీర్యం అయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ధరణి పేరుతో 20 లక్షల మంది రైతులకు నష్టం కలిగించారని ఆరోపించారు. తొలుత కేసీఆర్ పదవికి బైబై చెప్పి ఆ తర్వాత అతను దోచుకున్న డబ్బులను రాబట్టాలన్నారు. కేసీఆర్ దొచుకున్నదంతా వసూలు చేసి ప్రజలకు పంచిపెడతామని రాహుల్‌ హామి ఇచ్చారు. రాష్ట్రంలో యుద్ధం మెుదలైందన్న రాహుల్‌.. దీనిని దొరలు, ప్రజల మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు.

    ‘అదానీ కోసమే ఫోన్ల ట్యాపింగ్‌’

    దేశంలో ప్రతిపక్ష ఎంపీల ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహరంపై రాహుల్‌ గాంధీ స్పందించారు. అదానీని కాపాడేందుకే ఈ ఫోన్ ట్యాపింగ్స్ అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేతలకు యాపిల్‌ కంపెనీ నుంచి హెచ్చరిక మెయిల్ వచ్చిందన్నారు. హ్యాకింగ్‌కు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి కేంద్రంలోని భాజపా ఓర్వలేకపోతోందన్నారు. అందుకే విపక్షాలను అనేక ఇబ్బందులకు గురి చేయాలని భావిస్తోందని ఆరోపించారు.

    తెలంగాణకు రాహుల్‌, ప్రియాంక

    కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. రేపు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో ప్రియాంక పాల్గొంటారు. మ. 3 గంటలకు దేవరకద్రకు ఆమె చేరుకుంటారు. సా. 4.30 గంటలకు కొల్లాపూర్‌లోని పాలమూరు ప్రజాభేరి సభలో పాల్గొంటారు. అక్కడ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరోవైపు రాహుల్‌ నవంబర్‌ 1, 2 తేదీల్లో తెలంగాణలో పర్యటిస్తారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

    నేటితో ముగియనున్న రాహుల్ బస్సు యాత్ర

    నేటితో మొదటి దశ కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్ర ముగియనుంది. ఈరోజు ఉదయం 9 గంటలకు చొప్పదండి అసెంబ్లీ నియోజక వర్గం గంగాధర నుంచి రాహుల్ గాంధీ బస్సు యాత్ర స్టార్ట్ కానుంది. 9.30కి కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో రాహుల్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. 11 గంటలకు జగిత్యాల పట్టణంలో కార్నర్ మీటింగ్, 12 గంటలకు వేములవాడ నియోజక వర్గం మేడిపల్లిలో సమావేశం. మధ్యాహ్నం 1 గంటకు కోరుట్లలో సమావేశం, 1.30కి భోజన విరామం, 2.30 గంటలకు ఆర్మూర్‌లో సభ, ఆర్మూర్ నుండి హైదరాబాద్ … Read more

    రాహుల్ లీడర్‌ కాదు రీడర్: కేటీఆర్

    ఓటుకు నోటు కేసు గజదొంగ రేవంత్ రెడ్డిని పక్కన పెట్టుకుని రాహుల్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్‌ను పట్టుకుని కుటుంబ పాలన అంటున్నారు… రాహుల్ ఎక్కడి నుంచి వచ్చాడో గుర్తు లేదా అని ఎద్దేవా చేశారు. రాహుల్ లీడర్‌ కాదు.. రీడర్. కాంగ్రెస్‌ నేతలు ఏది చదివిస్తే అదే చదువుతారు. నేర్చుకునే ప్రయత్నం చేయరు. నోటికి ఎదొస్తే అది వాగి వెళ్లడం సరికాదంటూ విమర్శించారు.

    దొర ఇలాకలో మనకు మంచి రోజులు: రాహుల్

    ములుగు బస్సు యాత్రలో రాహుల్ గాంధీ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో దొరల తెలంగాణకి.. ప్రజల తెలంగాణకు మధ్య యుద్ధం. దొర ఇలాకాలో మనకీ మంచి రోజులు వచ్చాయి అనిపిస్తుంది. కేసీఆర్‌ కుటుంబం తెలంగాణ సంపదను లూటీ చేస్తుంది. కర్ణాటకలో మహిళలందరూ ఫ్రీగా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. నేను అబద్ధం చెప్పను. పనికి మాలిన మాటలు చెప్పను. కేసీఆర్‌లా 3 ఎకరాల భూమి ఇస్తాం లాంటి హామీలు ఇవ్వడానికి రాలేదు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం’ అని హామీ ఇచ్చారు.

    రాహుల్ ఎందుకు నోరు మెదపలేదు: కేటీఆర్

    కాంగ్రెస్ బస్సుయాత్ర.. తుస్సుమనడం ఖాయమని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక. గత పదేళ్ల కాలంలో గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదు. విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్‌కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదు అని విమర్శించారు.

    మీ కలను కాంగ్రెస్‌ అర్థం చేసుకుంది: ప్రియాంక

    ములుగు బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ… ‘తెలంగాణ ఇస్తే రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని సోనియాకు తెలుసు. రాజకీయ లబ్దికోసం కాకుండా, తెలంగాణ ప్రజల కోరిక మేరకు ఆ నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాంతాచారికి నా నివాళి. ఉద్యోగాలు, నిధుల కోసం మీరు కలలు కన్నారు. మీ కలలు సాకారం అవుతాయని బీఆర్‌ఎస్‌ను నమ్మి ఓటేశారు. ఉద్యోగాలు వస్తాయని పిల్లల భవిష్యత్‌ మారుతుందని అనుకున్నారు. మీ కలను కాంగ్రెస్‌ అర్థం చేసుకుంది. సామాజిక న్యాయం జరగాలన్నదే కాంగ్రెస్‌ సిద్ధాంతం’ అని చెప్పుకొచ్చారు.

    రెండో రోజుకు రాహుల్ బస్ యాత్ర

    తెలంగాణలో రాహుల్ గాంధీ బస్సు యాత్ర రెండోరోజుకు చేరుకుంది. ఈరోజు భూపాలపల్లి నుంచి కాటారం వరకు బస్సు యాత్ర కొనసాగనుంది. నిరుద్యోగుల బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. కాటారం పక్కనే రైతులతో సమావేశం కానున్నారు. అక్కడే వారితో కలిసి భోజనం చేయనున్నారు. మంథని బైపాస్ నుంచి నేరుగా పెద్దపల్లికి రాహుల్ చేరుకోనున్నారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రాత్రి కరీంనగర్‌లో బసచేయనున్నారు.

    నేడు తెలంగాణకు రాహుల్, ప్రియాంక

    నేడు తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రానున్నారు. సాయంత్రం 3:30 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోనున్న రాహుల్‌, ప్రియాంక.. బేగంపేట్‌ నుంచి హెలికాప్టర్‌లో రామప్ప టెంపుల్‌కు చేరుకోనున్నారు. అక్కడ ప్రత్యేక పూజల తర్వాత సాయంత్రం 5 గంటలకు బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. రామప్ప గుడి నుంచి బయల్దేరనున్న బస్సు యాత్ర ములుగు చేరుకోనుంది. ములుగులో కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్, ప్రియాంకలు ప్రసంగిస్తారు.