TRS, BJPలపై రాహుల్ ఫైర్
తెలంగాణలో నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ టీఆర్ఎస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. ‘బీజేపీ కేంద్రంలో, టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీలు ప్రజాక్షేమం చూడకుండా దోచుకుతింటున్నాయి. బీజేపీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రతిబిల్లుకు TRS మద్దతు ఇచ్చింది. రెండు పార్టీలు MLAలను కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టిస్తున్నాయి. హింస, ద్వేషం రూపుమాపడమే ఈ యాత్ర లక్ష్యం’ అని ప్రసంగించారు.