శామ్ సంగ్ లోకి మెటా ప్రముఖ మాజీ ఉద్యోగి
మెటా పబ్లిక్ పాలసీ మాజీ అధినేత రాజీవ్ అగర్వాల్ శామ్ సంగ్ లో చేరనున్నారు. శామ్ సంగ్ కంపెనీ దేశీయ విధానాలపై ప్రభుత్వ ఉద్యోగులతో అనుసంధానం వంటి బాధ్యతలు చేపట్టనున్నారు. మెటాలో నిర్వర్తించిన విధులనే శామ్ సంగ్ లోనూ కొనసాగించనున్నారు. డిసెంబర్ లో బాధ్యతలు స్వీకరించనున్నారు. మెటా కంటే ముందు ఉబర్ లో దక్షిణాసియా విధానధిపతిగా పనిచేశారు. త్వరలోనే 1100లకు పైగా ఉద్యోగులను తొలగిస్తామని మెటా ప్రకటించిన కొద్దిరోజులకు రాజీనామా చేశారు.