• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రధాని ఆవిష్కరించిన పనులు ఇవే..

    తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేశారు. రూ.6300 కోట్లతో ఈ కర్మాగారాన్ని నిర్మించారు. అనంతరం డిజిటల్ విధానంలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసి కొన్నింటిని ప్రారంభించారు. రూ.2,268 కోట్లతో 3 జాతీయ రహదారుల విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. వాటి వివరాలు. భద్రాచలంసత్తుపల్లి రైలు మార్గం ప్రారంభం మెదక్ సిద్దిపేట- ఎల్కతుర్తి హైవే విస్తరణ సిరొంచా మహాదేవ్ పుర్ హైవే విస్తరణ బోధన్ బాసర- భైంసా హైవే విస్తరణ

    ప్రధాని పర్యటనకు కేసీఆర్‌ దూరం

    ప్రధాని మోదీ నేడు తెలంగాణలో పర్యటిస్తుంటగా..సీఎం కేసీఆర్‌ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. కేంద్రం వైఖరికి నిరసనగా ఆయన దూరం పాటిస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రధానికి స్వాగతం పలుకుతారు. మరోవైపు ఇప్పటికే ఉత్పత్తి జరుగుతున్నరామగుండం పరిశ్రమకు ప్రారంభోత్సవం చేయడం ఏమిటని వామపక్షాలు రామగుండం బంద్‌కు పిలుపునిచ్చాయి. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ..కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ‘గో బ్యాక్‌ మోదీ’ పిలుపుతో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు.

    ఈనెల 12న రాష్ట్రంలో అగ్నిగుండమే!

    తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన రాజకీయ రగడను సృష్టించేలా కనిపిస్తోంది. ఈ నెల 12న రామగుండంలో మోదీ పర్యటించనున్నారు. అయితే ప్రధాని పర్యటనను తప్పక అడ్డుకుని తీరతామని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ ప్రకటించింది. యూనివర్సిటీల కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బిల్లుపై తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. కాదని ఆయన వస్తే రామగుండ అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. అసెంబ్లీ ఆమోదం పొందిన ఈ బిల్లును గవర్నర్‌ ఆమోదించలేదు. మరోవైపు వామపక్ష నేతలు సైతం ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించారు.

    గోల్డ్ చైన్ కోసం భర్తను చంపిన భార్య

    భార్య చేతిలో ఓ భర్త దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన రామగుండంలోని ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లో చోటుచేసుకుంది. చిలుముల సుమన్, స్పందన దంపతులు. స్పందన వద్ద ఉండాల్సిన బంగారు చైన్ ఏమైందని సుమన్ నిలదీశాడు. తన అన్న వద్ద ఉందని ఆమె చెప్పింది. దీంతో ఆమెను భర్త చితకబాదాడు. స్పందన ఎదురుతిరిగి భర్త తలపై ఇటుకరాయితో బాది చంపేసింది. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    సింగ‌రేణి బొగ్గుగ‌నిలో ప్రమాదం.. నలుగురి మృతి

    పెద్ద‌ప‌ల్లిలోని సింగరేణి బొగ్గు గనిలో భారీ ప్రమాదం జరిగింది. రామ‌గుండం ఏఎల్‌పీ గనిలో బొగ్గును పైకి తెస్తున్న స‌మ‌యంలో పైక‌ప్పు కూలి ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు వ్య‌క్తుల చ‌నిపోయారు. అందులో ముగ్గురు కార్మికులు ఉండ‌గా, అసిస్టెంట్ మేనేజ‌ర్ ఉన్నారు. శిథిలాల కింద మ‌రో ఏడుగురు చిక్కుకుపోగా, అందులో ముగ్గ‌రిని రెస్క్యూ సిబ్బంది ర‌క్షించారు. కాగా, స‌హాయ‌క చ‌ర్య‌ల్లో భాగంగా రెస్క్యూ సిబ్బంది చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇక‌, విష‌యం తెలియగానే కార్మిక సంఘాల నేత‌లు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. లోప‌లికి వెళ్ల‌కుండా … Read more