• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లోన్ రికవరీకి నిబంధనలు కఠినతరం

    రుణ బకాయిల వసూలుకు సంబంధించి RBI నిబంధనలు కఠినతరం చేసింది. రుణగ్రహితలకు ఆయా సంస్థలు ఉదయం 8 లోపు, సాయంత్రం 7 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్ చేయకూడదని పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక సేవల్లో ఔట్‌ సోర్సింగ్‌, ప్రవర్తనా నియమావళికి సంబంధించి ముసాయిదాను RBI విడుదల చేసింది. డైరెక్ట్‌ సేల్స్‌ ఏజెంట్లు, డైరెక్ట్‌ మార్కెటింగ్‌ ఏజెంట్లు, రికవరీ ఏజెంట్లకు తాము తీసుకువచ్చిన ప్రవర్తనా నియామావళిని అమలు చేయాలని పేర్కొంది. కస్టమర్లతో మాట్లాడే విషయంలో ఏజెంట్లకు తగిన శిక్షణ ఇవ్వాలని సూచించింది. © ANI … Read more

    గడుపు ముగిసినా రూ.2వేల నోట్లు మార్చుకోవచ్చు

    RBI రూ.2వేల నోట్ల మార్పిడిపై కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 8వ గడువు ముగిసిన తర్వాత కూడా నోట్లను మార్చుకోవచ్చని పేర్కొంది. అయితే, ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేసింది. రూ.2000 నోట్లు ఉపసంహరణకు ముందు రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణీలో ఉన్నాయి. అందులో రూ.3.43 లక్షల కోట్లు ఇప్పటి వరకు వెనక్కి వచ్చినట్లు RBI పేర్కొంది. వాటిలో 87 శాతం నోట్లు డిపాజిట్ల రూపంలోనే వచ్చాయని వెల్లడించింది.

    వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ

    వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని ఆర్బీఐ వెల్లడించింది. గవర్నర్ శక్తికాంత్‌దాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రెపో రేటు: 6.5%, రివర్స్ రెపో రేటు: 3.35%, ఎస్‌డీఎఫ్‌ఆర్: 6.25%, ఎమ్ఎస్ఎఫ్ఆర్:6.75%, బ్యాంక్ రేటు: 6.75% వద్ద కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 6.5 శాతం ఉంటుందని అంచనా వేసింది. వృద్ధి రేటు బాగానే ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగినట్లు వెల్లడించింది.

    8 బ్యాంకుల లైసెన్స్‌ రద్దు చేసిన RBI

    నిబంధనలు పాటించని 8 రకాల బ్యాంకులపై ఆర్బీఐ కొరఢా ఝులిపించింది. 8 సహకార బ్యాంకుల లైసెన్స్‌లను రద్దుచేసింది. తగినంత మూలధనం లేకపోవడం, బ్యాంకింగ్ నియంత్రణ చట్టాన్ని పాటించకపోవడం, భవిష్యత్‌లో నష్టాల బాట పట్టే ప్రమాదం ఉండటంతో RBI వీటి లైసెన్స్‌లు రద్దు చేసింది. లైసెన్స్‌ కోల్పోయిన బ్యాంకులు.1. ముధోల కో-ఆపరేటివ్ బ్యాంక్2. మిలాత్ కో-ఆపరేటివ్ బ్యాంక్3. శ్రీ ఆనంద్ కో-ఆపరేటివ్ బ్యాంక్4. రూపి కో-ఆపరేటివ్ బ్యాంక్5. దక్కన్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్6. లక్ష్మీ కో-ఆపరేటివ్ బ్యాంక్7. సేవా వికాస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ బ్యాంక్ 2022-23 … Read more

    క్రెడిట్ కార్డుతో యూపీఐ చెల్లింపులు

    క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ చెల్లింపులు చేసుకునే సౌలభ్యాన్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ కల్పిస్తోంది. త్వరలోనే దీనిని అమలులోకి తీసుకు రానున్న తొలి బ్యాంకుకా ఘనత సాధించనుంది. డిజిటల్ వ్యాలెట్‌తో కోటక్ మహీంద్రా క్రెడిట్ కార్డును లింక్ చేసుకుని యూపీఐ చెల్లింపులు జరపొచ్చు. రూపే కార్డులకు మాత్రమే ఈ ఫీచర్ వర్తిస్తుంది. ఈ సేవలను పొందడానికి ముందుగా క్రెడిట్ కార్డును యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ బ్యాంక్ అకౌంట్ క్లిక్ చేసి.. క్రెడిట్ కార్డు ఆప్షన్‌ని ఎంచుకున్న అనంతరం వివరాలు సమర్పించాలి. త్వరలో మిగతా … Read more

    గడువు తీరినా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు

    క్రెడిట్ కార్డు నిబంధనలను ఆర్బీఐ తాజాగా సవరించింది. గడువు తేదీ ముగిసినా ఎలాంటి జరిమానా లేకుండా బిల్లు చెల్లించేందుకు వీలు కల్పిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. గడువు తేదీ ముగిసిన 3 రోజుల వరకూ ఫైన్ లేకుండా బిల్లు కట్టవచ్చు. పైగా, ఇలా చేయడం వల్ల క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపదు. దీంతో ఎప్పుడైనా బిల్లు చెల్లించడం మర్చిపోయినా కంగారు పడాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఆ 3 రోజుల సమయం కూడా దాటిపోతే క్రెడిట్ కార్డు కంపెనీలు పెనాల్టీలు విధిస్తాయి. బిల్లును బట్టి … Read more