తెలంగాణలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రవాయుగుండంగా మారనుంది. ఈమేరక వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో ఇప్పటికే రాష్ట్రమంతా వానలు కురుస్తుండగా..తాజాగా 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉత్తర తెలంగాణలోని మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చారు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ప్రస్తుతం చిరుజల్లులు కురుస్తున్నాయి.