• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆసక్తిగా ‘800’ ట్రైలర్!

    శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా ‘800’ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్‌ను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇవాళ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. మురళీధరన్ చిన్ననాటి నుంచి తాను క్రికెటర్‌టా ఎదిగినంతవరకు ఈ చిత్రంలో చూపించినట్లు తెలుస్తోంది. మురళీధరన్ పాత్రలో హీరో మధుర్ మిట్టల్ ఒదిగిపోయాడు. కాగా ఈ సినిమాను ఎంఎస్ శ్రీపతి తెరకెక్కించారు. జిబ్రాన్ సంగీతం అందించారు.

    ఆకట్టుకుంటున్న ‘మార్క్ ఆంటోనీ’ ట్రైలర్

    విశాల్ హీరోగా నటించిన ‘మార్క్ ఆంటోనీ’ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ మూవీ ట్రైలర్‌ను తెలుగులో నటుడు దగ్గుబాటి రానా విడుదల చేశారు. ట్రైలర్‌ను బట్టి చూస్తే టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించారు. రీతూవర్మ హీరోయిన్‌గా నటించింది. ఎస్ జే సూర్య, సునీల్, సెల్వరాఘవన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    ‘భగవంత్ కేసరి’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్

    నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘భగవంత్ కేసరి’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ‘గణేష్ ఆంతం’ పేరుతో ఓ సాంగ్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు. కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీలీలలు నటించారు. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కించారు. సాహూ గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలుగా వ్యవహరించారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ మూవీ విడుదల కానుంది.

    ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ రిలీజ్

    టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ట్రైలర్ ఫన్ రైడ్‌తో నిండి ఉంది. ట్రైలర్‌ను చూశాకా సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. కాగా ఈ మూవీని డైరెక్టర్ మహేష్ బాబు.పి తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

    ‘టైగర్ నాగేశ్వరరావు’ వచ్చేశాడు

    మాస్ మహరాజా రవితేజ హీరోగా నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ మూవీ టీజర్‌ను ఇవాళ మేకర్స్ రిలీజ్ చేశారు. మూవీ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. టీజర్‌ను చూస్తూంటే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని స్టువర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తీస్తున్నారు. కాగా ఈ మూవీలో రవితేజ సరసన నుపుర్ సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వంశీ తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ 20న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది.

    ఆసక్తికరంగా ‘బెదురులంక’ ట్రైలర్

    టాలీవుడ్ హీరో కార్తికేయ గుమ్మకొండ నటించిన ‘బెదురులంక 2012’ మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. విజువల్స్ చాలా బాగున్నాయి. యుగాంతం కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీలో కార్తికేయ సరసన నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది. క్లాక్స్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. వెన్నెల కిశోర్, ఆటోరాంప్రసాద్, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఆగష్టు 25న ఈ మూవీ విడుదల కానుంది.

    ‘గాండీవధారి అర్జున’ ట్రైలర్ వచ్చేసింది

    మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గాండీవధారి అర్జున’ మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఇవాళ ప్రసాద్ ఐమ్యాక్స్‌లో మూవీ మేకర్స్ ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. యాక్షన్ సీన్స్‌లో వరుణ్ తేజ్ అదరగొట్టాడు. కాగా ఈ మూవీలో వరుణ్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని ఆగష్టు 25న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేస్తున్నారు.

    ‘ఖుషీ’ ట్రైలర్ వచ్చేసింది

    విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషీ’ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఇవాళ ఈ సినిమా ట్రైలర్‌ను మూవీమేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా సాగింది. ట్రైలర్‌ను బట్టి చూస్తే విజయ్, సమంతల రొమాన్స్ బాగానే పండినట్లు తెలుస్తోంది. ట్రైలర్ విడుదలైన తర్వాత మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా ఈ సినిమాను డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1న విడుదల చేస్తున్నారు.

    ప్రభుదేవా ‘వూల్ఫ్’ టీజర్ వచ్చేసింది

    ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా నటించిన ‘వూల్ఫ్’ మూవీ టీజర్ రిలీజైంది. ఈ సినిమా ప్రభుదేవాకు 60వ చిత్రం కావడం విశేషం. టీజర్‌ను బట్టి చూస్తే న్యాచురల్ హారర్ మూవీలా కనిపిస్తోంది. టీజర్‌ థ్రిల్లింగ్‌గా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాను విను వెంకటేశ్ తెరకెక్కించారు. కేథరీన్, రాయ్‌లక్ష్మీ, అనసూయ భరద్వాజ్‌లు కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. సందేశ్ నాగరాజ్, భూషణ్ కుమార్‌లు సంయుక్తంగా నిర్మించారు.

    యాక్షన్ హంగులతో ‘జైలర్’ ట్రైలర్

    సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ మూవీ ట్రైలర్ విడుదలైంది. తెలుగులో ఈ ట్రైలర్‌ను టాలీవుడ్ హీరో నాగచైతన్య రిలీజ్ చేశారు. ‘జైలర్’ ట్రైలర్ మాస్ యాక్షన్ హంగులతో అదిరిపోయింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా రజినీ సరసన తమన్నా హీరోయిన్‌గా నటించింది. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు. కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరించారు. మోహన్‌లాల్, జాకీష్రాఫ్, శివరాజ్ కుమార్, నాగబాబు కీలక పాత్రలు పోషించారు. ఆగష్టు 10న రిలీజ్ కానుంది.