టీడీపీ ఆఫీస్ తొలగింపుతో ఉద్రిక్తత
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి టీడీపీ కార్యాలయాన్ని పోలీసులు తొలగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ఇంటికి సమీపంలో ఉన్న టీడీపీ ఆఫీస్‌ను పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తొలగించారు. ఫ్లెక్సీలు, కంప్యూటర్, ఫర్నీచర్‌ను అక్కడి నుంచి తరలించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి భారీగా తరలివచ్చారు. దేవినేని ఉమాను గృహనిర్భంధం చేశారు. భూ వివాదాల నేపథ్యంలోనే కార్యాలయాన్ని తొలగించినట్లు తెలుస్తోంది.