• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏపీ ఓటర్లలో మహిళలదే పైచేయి

    ఏపీలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా వెల్లడించారు. మొత్తం 4,02,21,450 ఓటర్లలో అత్యధికంగా 2,03,85,851 మంది మహిళలు ఉన్నట్లు ప్రకటించారు. పురుష ఓటర్ల సంఖ్య 1,98,31,791గా ఉన్నట్లు తెలిపారు. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 5,54,060 మంది అధికంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. అటు సర్వీసు ఓటర్లు 68,158 మంది ఉంటే థర్డ్‌ జెండర్‌ ఓటర్లు 3,808 మంది ఉన్నారని వివరించారు. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి అర్హులైన ఓటర్లందరినీ నమోదు … Read more

    1న రాష్ట్ర అవతరణ దినోత్సవం

    AP: ఈ ఏడాది కూడా రాష్ట్ర అవతరణ దినో­త్సవాన్ని నవంబర్‌ 1న ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ వేడుకల్లో సీఎం జగన్‌ పాల్గొంటారు. ఉ.10.00 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అమ­రజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పిస్తారు. అటు అన్ని జిల్లా కేంద్రా­ల్లో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఉత్సవంగా నిర్వహించాలని కలెక్టర్లు, ఎస్పీలకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మెుదలు పెట్టాలని ఆదేశించింది.

    వచ్చే నెల నుంచి కందిపప్పు పంపిణీ

    ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే నెల (నవంబర్‌) నుంచి క్రమం తప్పకుండా లబ్దిదారులకు కందిపప్పు అందించనున్నట్లు ప్రకటించింది. కిలో రూ.67 చొప్పున ప్రతీ కార్డుకు ఒక కేజీ కందిపప్పు అందజేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి దశలో 3,660 టన్నులు, రెండో దశలో 3,540 టన్నులు అందించనుంది. వచ్చే నెల అవసరాలకు గాను 2,300 టన్నుల సరఫరాకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మార్కెట్‌లో కిలో కందిపప్పు రకాన్ని బట్టి రూ.150 నుంచి రూ.180 వరకూ పలుకుతోంది.

    వైకాపా బస్సు యాత్ర ప్రారంభం

    AP: వైకాపా సామాజిక సాధికార బస్సు యాత్రను ఇచ్ఛాపురంలో మంత్రి బొత్స సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ‘ఈ యాత్రలో గత నాలుగేళ్లలో అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తాం. కేబినెట్‌లోనూ సామాజిక న్యాయం చేసిన నాయకుడు జగన్‌. వైకాపాకు ఓటు వేయని వారికి సంక్షేమ ఫలాలు అందించాం. విద్యారంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాం. నాడు-నేడుతో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. పేదల బతుకులు బాగుచేసిన ఘనత సీఎం జగన్‌దే’ అని వైసీపీ నేతలు అన్నారు.

    ‘చంద్రబాబు కంటికి చికిత్స అవసరం’

    AP: చంద్రబాబు కంటికి చికిత్స అవసరమని ఆయన్ను పరిశీలించిన కంటి వైద్యులు నివేదిక ఇచ్చారని టీడీపీ నేతలు తెలిపారు. అయితే చంద్రబాబు కంటికి ఇప్పట్లో ఎలాంటి చికిత్స అవసరం లేదన్నట్లుగా ఆ నివేదికను మార్చి ఇవ్వాలని ప్రభుత్వ వైద్యులపై జైలు అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. బుధవారం విడుదల చేసిన చంద్రబాబు హెల్త్‌ బులెటిన్‌లోనూ కంటిసమస్యను ప్రస్తావించకపోవడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా, నాలుగు నెలల క్రితం చంద్రబాబు కంటికి కేటరాక్ట్‌ ఆపరేషన్‌ జరిగినట్లు తెలుస్తోంది.

    రాజధానిగా విశాఖ.. GVL కీలక వ్యాఖ్యలు

    AP: విశాఖను ఇప్పట్లో రాజధానిగా ప్రకటించే అవకాశం లేదని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. విశాఖ రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉందని పేర్కొన్నారు. కోర్టు తీర్పు ఆధారంగానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఉత్తరాంధ్ర వెనుకబడిందని జీవీఎల్ ఆరోపించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం విజయవాడకు వస్తారని ఎంపీ తెలిపారు.

    పెళ్లి చేయలేదని కన్న తండ్రి హత్య

    AP: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో దారుణం జరిగింది. పెళ్లి చేయలేదనే నెపంతో తండ్రిని కుమారుడు హత్య చేశాడు. తెల్లవారుజామున తండ్రి బాలభద్రాచారిని ఇంటి నుంచి బయటకి తీసుకెళ్లిన కుమారుడు గురునారాయణ పథకం ప్రకారం హతమార్చాడు. తొలుత తన వెంట తెచ్చుకున్న కత్తితో తండ్రి గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత తాను కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. స్వల్ప గాయాలైన గురునారాయణను ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

    నేడు, రేపు ఎస్‌ఐ మెయిన్స్ పరీక్షలు

    AP: నేటి నుంచి రెండ్రోజుల పాటు రాష్ట్రంలో ఎస్‌ఐ మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. విశాఖపట్నం, ఏలూరు, గుంటూ­రు, కర్నూలు జిల్లా కేంద్రాల్లో శని, ఆదివారాల్లో మెయిన్స్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ విధానంలో రెండు పేపర్లు, డిస్క్రిప్టివ్‌ విధానంలో రెండు పేపర్లు చొప్పున మొత్తం నాలుగు పేపర్లుగా ఈ పరీక్షలను జరగనున్నాయి. మెయిన్‌ పరీక్షలకు మొత్తం 31,193 మంది అర్హత సాధించారు. వారిలో పురుషులు 27,590, మహిళలు 3,603. పరీక్షలకు సంబంధించి సందేహా­లుంటే slprb@ap.gov.inలో సంప్రదించవచ్చు.

    వైసీపీ ఎమ్మెల్యేపై హత్యాయత్నం

    AP: వైసీపీకి చెందిన పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణపై హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యే శంకర్ నారాయణ కారుపై దుండగులు బాంబు దాడి చేశారు. బాంబు పేలకపోవటంతో ప్రమాదం తప్పింది. గోరంట్ల మండలం గడ్డం తాండాలో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే తన సిబ్బందితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా దుండగులు బాంబులు విసిరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఓ అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఎలక్ట్రికల్ డిటోనేటర్లు విసిరినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

    బండారుపై సుప్రీంకోర్టుకు వెళ్తా: రోజా

    AP: టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు మంత్రి ఆర్కే రోజా అన్నారు. న్యాయపరంగా పోరాడతానని స్పష్టం చేశారు. ‘మహిళలను కించపరిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. చంద్రబాబు జైలుకెళ్లడంతో టీడీపీ నేతలకు పిచ్చెక్కింది. చంద్రబాబు తప్పు చేయకుంటే ఎందుకు బయటకు రాలేకపోతున్నారు?. టీడీపీ ఫెయిల్యూర్‌ను డైవర్ట్ చేయడానికే నన్ను టార్గెట్ చేశారు. టీడీపీ, జనసేనకు దిగజారుడు రాజకీయాలే తెలుసు’ అని రోజా అన్నారు.