• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కోలుకున్న రికీ పాంటింగ్

  కామెంట్రీ చేస్తుండగా అస్వస్థతకు గురైన ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి పాంటింగ్ డిశ్చార్జి అయ్యారు. అనంతరం తిరిగి కామెంట్రీ విధుల్లో చేరారు. ‘నేను మిమ్మల్ని బాగా భయపెట్టినట్టు ఉన్నాను. నిజంగా చెప్పాలంటే నాక్కూడా అది భయంకర క్షణమే. కానీ ఆ ఉదయం ఎంతో గొప్పది. షైనీ అండ్ న్యూ’ అని పాంటింగ్ చెప్పినట్లు వార్తలు ప్రచురించాయి. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పెర్త్‌ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా వెస్టిండీస్ మధ్య మ్యాచ్‌లో కామెంట్రీ చేస్తుండగా పాంటింగ్ ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. … Read more

  ఆసుపత్రికి రిక్కీ పాంటింగ్‌

  ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం రిక్కీ పాంటింగ్‌ ఆసుపత్రి పాలయ్యారు. పెర్త్‌లో ఆస్ట్రేలియా- వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న టెస్‌ మ్యాచ్‌కు కామెంటరీ చేస్తున్న రిక్కీ ఒక్కసారిగా అస్వస్థతకు గుర్యయ్యారు. దీంతో వెంటనే ఆయనను పెర్త్ ఆసుపత్రికి తరలించారు. రిక్కీ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన పరిస్థితిపై ఆసుపత్రి వర్గాల నుంచి సమాచారం రావాల్సి ఉంది.

  వేలంలో అతడిపైనే దృష్టి: పాంటింగ్

  వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కెమెరాన్ గ్రీన్‌ని కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్నామని రికీ పాంటింగ్ వెల్లడించాడు. దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న పాంటింగ్.. గ్రీన్ కోసం భారీగానే నిధులు మిగుల్చుకున్నట్లు తెలిపాడు. టీ20 ప్రపంచకప్‌నకు ముందు జరిగిన టీ20 సిరీస్‌లో గ్రీన్ రాణించాడు. మూడు మ్యాచులాడి రెండింట్లో అర్ధశతకం సాధించాడు. ముఖ్యంగా మొదటి టీ20లో భారత్ విధించిన 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో గ్రీన్ కీలకపాత్ర పోషించాడు. డిసెంబరు 23న జరిగే మినీ వేలానికి ఈ ఆటగాడు తన … Read more

  విరాట్‌ది చరిత్రలో నిలిచిపోయే సిక్స్‌: రికీ పాంటింగ్‌

  వరల్డ్‌ కప్‌ సూపర్‌ 12 మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలర్‌ హరీస్‌ రౌఫ్‌ ఓవర్‌లో విరాట్‌ బాదిన సిక్సర్‌ టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో నిలిచిపోయే షాట్‌ అని ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌ అభిప్రాయపడ్డారు. “మ్యాచ్‌ కీలక దశలో ఉన్నపుడు 19 ఓవర్లో చివరి రెండు బంతులనూ విరాట్‌ సిక్సర్లుగా మలిచాడు. అందులో తొలి సిక్సర్‌ అద్భుతం. లెంథ్‌ సరిగా దొరక్కపోయినా, బలంగా హిట్‌ చేసే అవకాశం లేకపోయినా, కోహ్లీ తన ఫిట్‌నెస్‌తో బంతిని మిడిల్‌ చేశాడు” ఈ సిక్సర్‌ టీ20 వరల్డ్‌ కప్‌ చ … Read more

  పాంటింగ్‌ని తప్పు పట్టిన అశ్విన్

  టీ20 ప్రపంచకప్‌లో భారత్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యాఖ్యలపై టీమిండియా ప్లేయర్ అశ్విన్ స్పందించాడు. పాంటింగ్ వ్యాఖ్యలను తప్పుపట్టాడు. ‘చిన్న చిన్న ఘటనలు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాయి. పరిస్థితులకు తగ్గట్లు నడుచుకోవాలి. పాక్‌తో మ్యాచులో మేం చివరి బాల్ వరకు పోరాడాం. పూర్తి స్థాయి ప్రదర్శన చేయలేదని సరైంది కాదు. అప్పటి పరిస్థితులకు లోబడి ఆడాల్సి ఉంటుంది. అలాగే ఆడి మేం గెలిచాం’ అని అశ్విన్ బదులిచ్చాడు. 4 మ్యాచుల్లో 3 విజయాలతో టీమిండియా … Read more

  కోహ్లీతోనే ప్రపంచకప్‌ వస్తుంది: పాంటింగ్‌

  భారత్‌కు వరల్డ్‌కప్‌ తీసుకురావటం కోహ్లీతోనే సాధ్యమని ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్‌ అన్నారు. కోహ్లీ ఇలాగే ఆడటం కొనసాగిస్తేనే టీమిండియా కప్‌ కొడుతోందని అభిప్రాయపడ్డారు. “కోహ్లీని తొలిగించాలన్నప్పుడు అతడి అవసరం ప్రపంచకప్‌లో ఉంటుందన్నాను. అది కోహ్లీ పాక్‌పై మ్యాచ్‌లో నిరూపించాడు. ఆ మ్యాచ్‌ చివర్లో కోహ్లీ ఏదైనా చేస్తాడనిపించింది. అనుకున్నట్లే జరిగింది. కానీ, టీమిండియా ఇప్పటివరకు అత్యుత్తమ ఆట ఆడలేదు.” అని పాంటింగ్‌ చెప్పాడు.

  ‘కోహ్లి వేరే లెవెల్ ప్లేయర్’

  విరాట్ కోహ్లి ప్రత్యేక ఆటగాడు అని, అలాంటి ఆటగాడిని మళ్లీ చూస్తామో లేదో తెలియదని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. వైట్ బాల్ క్రికెట్‌లో కోహ్లి రికార్డులు అద్భుతమని పేర్కొన్నాడు. విరాట్ కెప్టెన్‌గా జట్టును విజయపథంలో నడిపించాడని కొనియాడాడు. అతడి సారధ్యంలో ఆస్ట్రేలియా గడ్డపై గెలవడం అద్భుతమని పేర్కొన్నాడు. కాగా ఆసియాకప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై శతకం సాధించి ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి.. అప్పటినుంచి అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్తున్నాడు.

  అనుష్కను కొనియాడిన పాంటింగ్

  కోహ్లీ భార్య అనుష్క శర్మను ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కొనియాడాడు. కోహ్లీ కెరీర్‌పై తప్పకుండా ఆమె సానుకూల ప్రభావం చూపించి ఉంటుందని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఒక క్రీడాకారుడికి తన కుటుంబం ఇచ్చే మద్దతు వెలకట్టలేనిదని తెలిపాడు. కోహ్లీ పుంజుకోవడంలో అనుష్క పాత్ర కూడా ఉంటుందన్నాడు. T20ల్లో తొలి సెంచరీ చేశాక.. కోహ్లీ ముఖంపై చిరునవ్వు చూడటం సంతోషాన్నిచ్చిందన్నాడు. మైదానంలో విరాట్ రాణించడం గొప్ప విషయమని పాంటింగ్ తెలిపాడు.

  ‘సచిన్ 100 సెంచరీలు విరాట్‌కు సాధ్యమే’

  సచిన్ 100 అంతర్జాతీయ క్రికెట్ సెంచరీల రికార్డును అధిగమించడం కోహ్లీకి సాధ్యమేనని రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా)అభిప్రాయం వ్యక్తం చేశాడు. సోమవారం జరిగిన ఐసీసీ రివ్యూ భేటీలో భాగంగా పేర్కొన్నారు. విరాట్ తన 71వ అంతర్జాతీయ సెంచరీ చేసిన తర్వాత ఈ వార్తలు మళ్లీ పంజుకున్నాయని చెప్పవచ్చు. ఆల్ టైమ్ గ్రేట్స్‌లలో కోహ్లీ ఒకరని, వచ్చే 3-4 ఏళ్లలో ఏడాదికి 5-6 టెస్టు సెంచరీలు చేస్తే ఈ రికార్డు చాలా సులభమని పేర్కొన్నాడు. అతని కెరీర్‌లో ఇంకా చాలా సమయం ఉందని, విరాట్ మళ్లీ పరుగులు చేయడం … Read more

  ‘సూర్య 360 డిగ్రీ షాట్స్ డివిలియర్స్ మాదిరిగా ఉన్నాయ్’

  భారత టాప్ ర్యాంక్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్‌తో సూర్యను పోల్చాడు. ఏబీ మాదిరిగానే యాదవ్ కూడా 360 డిగ్రీ షాట్‌లను ఆడుతున్నట్లు పేర్కొన్నాడు. ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ అతనికి పెద్దగా ఇబ్బంది కలిగించదన్నాడు. టీ20 ఫార్మాట్‌లో సూర్య ఈ ఏడాది అద్భుతంగా రాణించాడు. 12 మ్యాచ్‌ల్లో 428 పరుగులు చేసి 189.38 స్ట్రైక్ రేట్‌ నమోదు చేశాడు.