• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జూన్‌లో ‘కాంతార2’ షూటింగ్ ప్రారంభం

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కాంతార’ సినిమాకు పార్ట్ 2 రాబోతోంది. ఈ ఏడాది జూన్ నుంచి సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని చిత్ర నిర్మాత వెల్లడించారు. వర్షాకాలం నేపథ్యంలో కొన్ని సీన్లు ఉండనున్నాయని, అందుకే చిత్రీకరణను అప్పుడు ప్రారంభిచాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు దర్శకుడు రిషబ్ శెట్టి చిత్ర పనుల్లో బిజీగా ఉన్నారని తెలిపారు. గతేడాది విడుదలైన కాంతార సినిమా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించగా, హోంబలే ఫిల్మ్స్‌ నిర్మించింది.

    రష్మికకు రిషభ్ శెట్టి కౌంటర్!

    కొద్ది రోజులుగా కన్నడ హీరో రిషభ్ శెట్టి, నేషనల్ క్రష్ రష్మిక మందన్నాల మధ్య కోల్డ్‌వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రిషభ్.. రష్మికకు పరోక్షంగా కౌంటర్ ఇస్తూ ఓ ట్వీట్ చేశాడు. ‘కిరిక్ పార్టీ’ మూవీతో రష్మిక సినీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆరేళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి రిషభ్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో అందరి పేర్లూ ట్యాగ్ చేశాడు కానీ రష్మిక పేరు మాత్రం ట్యాగ్ చేయలేదు. దీంతో రష్మికకు ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్ … Read more

    రిషబ్‌తో పనిచేయాలని ఉంది: అనిల్ కపూర్

    కాంతార సినిమా హీరో, దర్శకుడు రిషబ్ శెట్టిపై బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ ప్రశంసల వర్షం కురిపించాడు. రిషబ్ శెట్టితో కలిసి పనిచేయాలని ఉందని ఈ సందర్భంగా మనసులో మాటను చెప్పాడు. వీరిద్దరూ కలిసి ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా అనిల్ కపూర్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశాడు. ‘తర్వాత సినిమాను నాతో చేయండి’ అంటూ రిషబ్‌ని అనిల్ కపూర్ కోరాడు. బాలీవుడ్ తారలు కాంతార సినిమాకు ఫిదా అవుతున్నారు. ఇటీవల హృతిక్ రోషన్ రిషబ్ శెట్టిని తన మాటలతో ఆకాశానికి ఎత్తుకున్నాడు. నవాజుద్దీన్ … Read more

    కాంతార సినిమాపై హృతిక్ ఏమన్నాడంటే?

    ‘కాంతార’ సినిమా నుంచి ఎంతో నేర్చుకున్నానని బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ట్విటర్ వేదికగా వెల్లడించాడు. కథతో ప్రేక్షకులను ఒప్పించిన తీరు అద్వితీయమని రిషబ్ శెట్టిని కొనియాడాడు. ‘కథ చెప్పిన విధానం, దర్శకత్వం, నటన అత్యద్భుతం. ముఖ్యంగా ఆ క్లైమాక్స్‌ని చూస్తుంటే రోమాలు నిక్కపొడుచుకున్నాయి. ఈ సినిమా నుంచి ఎంతో నేర్చుకున్నా. చిత్రబృందానికి నా అభినందనలు. వారి పనితీరు అమోఘం’ అని ట్వీట్ చేశాడు. దీనికి రిషభ్ శెట్టి స్పందిస్తూ.. ‘థాంక్యూ సో మచ్ సర్’ అంటూ బదులిచ్చాడు. దేశవ్యాప్తంగా కాంతార సినిమా సుమారు … Read more

    రిషభ్ శెట్టి మూవీలో షారుఖ్ ఖాన్?

    కాంతారా ఫేం రిషభ్ శెట్టి చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హోంబలే ఫిల్మ్స్ తెరకెక్కిస్తున్న ఓ మూవీలో వీరు కలసి నటించనున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో హోంబలే ఫిల్మ్స్ స్పందించింది. తాము నిర్మించే ఏ చిత్రాల్లోనూ షారుఖ్ ఖాన్ నటించడం లేదని స్పష్టం చేసింది. కాగా కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతారా చిత్రాలను హోంబలే ఫిల్మ్స్ వారే తెరకెక్కించారు. ప్రస్తుతం ఇదే బ్యానర్‌లో ప్రభాస్ ‘సలార్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Screengrab Instagram: … Read more

    భారీ ధరకు కాంతార శాటిలైట్ హక్కులు

    రిషబ్ శెట్టి హీరోగా నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ కాంతార శాటిలైట్ ప్రసార హక్కులను ‘స్టార్ మా’ దక్కించుకుంది. ఏకంగా రూ.4.5కోట్ల భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది. ఒక డబ్బింగ్ సినిమాకు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం రికార్డు అని చెప్పాలి. అమెరికాలో తెలుగు డబ్బింగ్ కాంతార మూవీ 1 మిలియన్ డాలర్లు రాబట్టింది. దీన్ని బట్టి కాంతార క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రం ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.

    కేజీఎఫ్2ని దాటేసిన కాంతార

    అంచనాలు లేకుండా విడుదలై సంచలనాలు సృష్టించిన సినిమా ‘కాంతార’. తాజాగా ఈ సినిమా మరో రికార్డును బద్దలుకొట్టింది. కన్నడలో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన కేజీఎఫ్2ను దాటేసింది. రూ.175కోట్ల అత్యధిక కలెక్షన్లను దాటేసింది. తొలి రోజు రూ.2 కోట్ల వసూళ్లను సాధించి అదే ఊపుని కొనసాగించింది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తొలుత కన్నడలో విడుదలై మంచి టాక్‌ని సంపాదించడంతో మిగతా భాషల్లోనూ దర్శకనిర్మాతలు సినిమాను విడుదల చేశారు. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమా అందరి మెప్పునూ పొందుతోంది.

    ‘కాంతారా’ ఫేం రిషభ్ శెట్టిపై ట్రోల్స్

    ‘కాంతారా’ మూవీ బ్లాక్‌బ్లస్టర్‌గా నిలవడంతో రిషభ్ శెట్టిని ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో రిషభ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆయనపై ట్రోల్స్ మొదలయ్యాయి. ‘‘నేను ఒక కన్నడ వ్యక్తిని. హిందీలో సినిమాలు చేయను. ’’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ మాటలు నార్త్ ఇండియన్స్‌కు కోపం తెప్పించాయి. ‘కాంతారా’ ఎందుకు హిందీలో డబ్ చేశారని వారు ప్రశ్నిస్తున్నారు. ఆయనకు డబ్బు కావాలి కానీ హిందీ పరిశ్రమను గౌరవించడు అంటూ ఫైర్ అవుతున్నారు.

    ‘కాంతార’పై విమర్శలు పట్టించుకోను; రిషభ్‌ శెట్టి

    కన్నడ బ్లాక్ బ్లస్టర్ చిత్రం ‘కాంతారా’పై వస్తున్న విమర్శలను తాను పట్టించుకోనని ఆ చిత్ర హీరో రిషభ్ శెట్టి అన్నారు. సక్సెస్ టూర్‌లో భాగంగా చిత్ర బృందం ముంబై చేరుకుంది. 99శాతం ప్రశంసలు వస్తున్న చోట 1శాతం నెగిటివ్‌ కామెంట్లను పట్టించుకోనని ప్రేక్షకులే దానికి సమాధానం చెబుతారని అన్నారు. అలాగే బాలివుడ్‌లో ఏ హీరో కాంతార రీమేక్‌కు సరిపోతారని ప్రశ్నించగా…రీమేక్స్‌పై అంతగా ఆసక్తి లేదని రిషభ్ చెప్పుకొచ్చాడు. కాంతారలో పాత్ర చేయాలంటే అక్కడి విశ్వాసాలపై నమ్మకం ఉన్నవారు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

    కాంతారాకు కలెక్షన్ల వర్షం

    కన్నడ ఇండస్ట్రీ హిట్ చిత్రం “కాంతారా” కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తొలుత కన్నడ భాషలో రిలీజైన ఈ చిత్రం రూ. 100 కోట్ల గ్రాసర్‌గా నిలిచింది. అక్కడ భారీ సక్సెస్ తర్వాత ఈ చిత్రం పాన్ ఇండియాగా విడుదలైంది. తెలుగులో విడుదలైన తొలిరోజే నైజాంలో రూ.1.4 కోట్లు నెట్ వసూలు చేసింది. హీరో రిషబ్ శెట్టికి ఇదే తెలుగులో ఫస్ట్ ఎంట్రీ అయినప్పటికీ మంచి కంటెంట్ ఉండటంతో ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు. ఈరోజు ఆదివారం కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.