• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గేదెల యజమానులపై కేసు నమోదు

    వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి కారణమైన గేదెల యజమానులపై ఆర్ఫీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. గేదెల యజమానులను గుర్తించటానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు వత్వ-మణినగర్ మధ్య గేదెల గుంపు అడ్డు రావడంతో లోకో పైలట్ సడన్ బ్రేక్ వేశారు. దీంతో గేదెలను ఢీకొని ట్రైన్ ఇంజిన్ ముందుభాగం దెబ్బతిన్నది. ఈ ప్రమాదంలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. అడ్డు వచ్చిన 4 గేదెలు మృత్యువాతపడ్డాయి.

    మిస్సింగ్ బాలుడి కథ సుఖాంతం

    హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌లో బాలుడి మిస్సింగ్ కేసు సుఖాంతం అయింది. రైల్వే స్టేషనులో బాలుడిని ఎత్తుకెళ్లిన మహిళను మరియమ్మగా గుర్తించారు. సీసీటీవీల ఆధారంగా రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టి గంటల వ్యవధిలోనే నిందితురాలిని గుర్తించడం గమనార్హం. అయితే, బాలుడిని అపహరించడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు మరియమ్మను అధికారులు విచారిస్తున్నారు. తల్లిని నమ్మించి బాలుడిని మహిళ కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.