రూ.100 కోట్ల క్లబ్లో ‘ధమాకా’
మాస్ మాహరాజా రవితేజ, హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన ‘ధమాకా’ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలై రెండు వారాలు అవుతున్నా కలెక్షన్ల సునామీ ఆగడం లేదు. ఈ సినిమా మొదటి రోజు కన్నా 10వ రోజు ఎక్కువ కలెక్షన్లు కొల్లగొట్టింది. 11వరోజు రూ.94కోట్ల గ్రాస్ రాబట్టింది. 12వ రోజు రూ.100 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉంది. కాగా ఈ చిత్రాన్నిడైరెక్టర్ త్రినాథరావు నక్కిన తెరకెక్కించారు. రవితేజ యాక్షన్, శ్రీలీల అందం, అభినయం, డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.