ఓటీటీలోకి ధనుష్ ‘నేనే వస్తున్నా’
ధనుష్, సెల్వరాఘవన్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘నేనే వస్తున్నా’ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ నెల 27న అందుబాటులోకి రానుంది. వెలుగు, చీకటి మధ్య యుద్ధమే ఈ సినిమా అని అమెజాన్ ప్రైమ్ పేర్కొంది. ఈ మూవీ తమిళంలో మంచి విజయం సాధించినప్పటికీ తెలుగులో అంతగా ఆకట్టుకోలేక పోయింది. సెప్టెంబరు నెలాఖరున ఈ సినిమా విడుదలైంది. విభిన్నమైన సైకో థ్రిల్లర్‌కి హారర్‌ని టచ్ చేస్తూ డైరెక్టర్ సెల్వ రాఘవన్ తెరకెక్కించారు.