నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ రిలీజ్ డేట్ ఫిక్స్
నాగశౌర్య హీరోగా నటించిన ‘కృష్ణ వ్రింద విహారి’ మూవీ విడుదల తేదీ ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 23న మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. శెర్లీ సేతియా ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్కు అనీశ్ ఆర్.కృష్ణ దర్శకత్వం వహించాడు. నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.