నాలోనూ బలహీనతలు ఉన్నాయ్! శృతిహాసన్
తనలోనూ కొన్ని బలహీనతలు ఉన్నాయని, వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటున్నానని హీరోయిన్ శృతిహాసన్ తెలిపింది. ‘‘నటిగా పరిచయమైన సమయంలో ఇంత ఎత్తు ఉన్నావేంటి అని కొందరు హేళన చేశారు. నీ హైటే నీకు మైనస్ అవుతుందన్నారు. కానీ ఆ హైటే నాకు ప్లస్ పాయింట్ అయింది. ప్రభాస్, మహేష్ వంటి స్టార్లతో నటించే అవకాశం వచ్చింది.’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా శృతి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు సంక్రాంతిక కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.