ఈ రికార్డు పాక్ క్రికెటర్లదే..!
టీ20 అంటేనే ఫోర్లు, సిక్సులు. అరుదైన పరిస్థితుల్లో మాత్రమే మైదానంలో పరుగులకు ప్రాధాన్యమిస్తుంటారు. అయితే, ఒక్క సిక్స్ కూడా కొట్టకుండా అత్యధిక బంతులు ఆడిన ఆటగాళ్లున్నారు. మొదటి ఆరుగురిలో ఐదుగురు పాకిస్థానీ క్రికెటర్లే ఉండటం ఆసక్తికరమైన విషయం. ఈ జాబితాలో షోయబ్ మాలిక్ తొలి స్థానంలో ఉన్నాడు. 2009 టోర్నమెంటులో 140బంతులాడి ఒక్క సిక్స్ కూడా బాదలేదు. ఆ తర్వాతి స్థానాల్లో బాబర్ అజామ్(133), జింబాబ్వే క్రికెటర్ ఇర్విన్(125) నిలిచారు. అహ్మద్ షెహజాద్, సల్మాన్ బట్ చెరో 105 బంతులతో సమంగా ఉన్నారు.