నిద్రలేకపోతే ఇన్ని తిప్పలు?
సాధారణంగా మనిషికి రోజుకి 7-9 గంటల నిద్ర అవసరం. నిద్ర తగ్గితే మెదడు, శరీరం కోలుకోవటం కష్టమవుతుంది. అలసట, నీరసం తలెత్తుతాయి. హుషారు, ఉత్సాహం తగ్గుతాయి. ఏకాగ్రత కొరవడుతుంది. పోషక విలువలు లేని జంక్‌ఫుడ్, చిరుతిళ్లు తినాలనే కోరికలు ఎక్కువ అవుతాయి. రాత్రి నిద్ర తగ్గినప్పుడు పగటిపూట అరగంట సేపు కునుకు తీస్తే కొంతవరకు ఉపయోగపడొచ్చు. అంతకన్నా ఎక్కువసేపు పడుకుంటే నిద్ర ఆవహిస్తోంది. అయితే పగటి కునుకుతో రాత్రి నిద్ర భర్తీ కాదు.