నేడు ఆన్ లైన్ లో ప్రత్యేక దర్శన టికెట్లు
AP: నేడు ఆన్ లైన్ లో ప్రత్యేక దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఆగస్టు నెలకు సంబంధించి వృద్ధులు, దివ్యాంగుల కోటాలో టికెట్లు జారీ చేయనుంది.రోజుకు వెయ్యి చొప్పున ఈ టోకెన్లు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వీరికి ప్రతిరోజు మధ్యాహ్నం 3గంటలకు స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు తిరుమలలో వెంకన్న దర్శనానికి 8గంటల వరకు సమయం పడుతోంది.21 కంపార్టు మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.83కోట్లు వచ్చింది.