• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏపీ అప్పులు ఆర్థికపరమైన ఉల్లంఘనలే: కేంద్రం

    మద్యం ఆదాయం తాకట్టి పెట్టి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న రుణాలను కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టింది. ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఆర్థిక పరమైన ఉల్లంఘనలేనని తేల్చి చెప్పింది. ఈ అంశాలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి లేఖ రాశారు. ఈ క్రమంలో డిస్కంల అప్పుల నెలవారీ నివేదికలు, వెనకబడిన జిల్లాల నిధుల వినియోగంపై వివరణ ఇవ్వాలని లేఖలో ప్రశ్నించారు.

    ‘భారత్‌‌కి శ్రీలంక గతే పడుతుంది’

    ది ప్రింట్ వెబ్‌సైట్ సంచలనాత్మక కథనం రాసింది. భారత్ మేలుకోకుంటే శ్రీలంక మాదిరిగానే భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొవాల్సి వస్తుందని పేర్కొంది. 2021లో శ్రీలంక తీసుకున్న వారి స్థూల జాతీయ ఉత్పత్తికి మించి 102.8 శాతానికి చేరుకొందని వెల్లడించింది. ఇదే పరిస్థితి భారత్‌లోని పంజాబ్, బిహార్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, యూపీ రాష్ట్రాల్లో నెలకొనే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ రాష్ట్రాలు అప్పులభారం తగ్గించుకోకుంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వివరించింది.