నెమ్మదించిన బంగ్లా స్కోరు బోర్డు
భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లు నిలవలేకపోతున్నారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండడంతో బంగ్లా స్కోరు బోర్డు నెమ్మదించింది. బ్యాట్స్మెన్లు పరుగులు చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు. ప్రస్తుతం 20 ఓవర్లలో 107/4 పరుగులతో బంగ్లా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. క్రీజులో షకీబుల్ హసన్ (36), మహ్మదుల్లా (01) ఉన్నారు. లిటన్ దాస్ (29), యాసిర్ అలీ (25) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 2, మహ్మద్ సిరాజ్ 1, ఉమ్రాన్ మాలిక్ 1 వికెట్ చొప్పున పడగొట్టారు.