చాహల్‌ని తీసుకుంటే బాగుండేదా?
టీమిండియా ఓటమికి ప్రధాన కారణం బౌలింగే. అయితే, తుది జట్టులో లెగ్ స్పిన్నర్ చాహల్‌ని తీసుకోవాల్సిందని మాజీలు అంటున్నారు. ఇంగ్లండు జట్టులో ఎక్కువగా రైట్ హ్యాండర్లు ఉండటంతో చాహల్ పనికొచ్చేవాడని చెబుతున్నారు. వాస్తవానికి అడిలైడ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించింది. ఇంగ్లండ్ జట్టులో అదిల్ రషీద్, లివింగ్ స్టోన్, మొయినీ అలీ లెగ్ స్పిన్నర్లు. భారత బ్యాటర్లను ఈ త్రయం కట్టడిచేసింది. ఇక భారత బౌలింగులో అక్షర్ పటేల్ ఉన్నప్పటికీ పెద్దగా రాణించలేదు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.