• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కవిత, సంజయ్‌ల ఆత్మీయ పలకరింపు

    తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ ఉప్పు నిప్పుగా ఉండే టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలు ఆత్మీయంగా పలకరించుకున్నారు. నిజామాబాద్‌లోని ఓ బీజేపీ నేత గృహ ప్రవేశానికి వీరిద్దరూ హాజరయ్యారు. ఈ క్రమంలో ఒకరికొకరు ఎదురై కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. అనంతరం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, జిల్లా జడ్పీ చైర్మన్ విఠల్‌రావును సంజయ్‌కు కవిత పరిచయం చేశారు. బండి సంజయ్, కవిత ఎదురుపడిన వేళ.. | MLC Kavitha | Bandi Sanjay … Read more

    బండి సంజయ్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్

    TS: బండి సంజయ్‌పై పరోక్షంగా మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘పిచ్చోడి చేతిలో రాయి ఉంటే వచ్చిపోయేటోళ్లకు ప్రమాదం.. కానీ అదే పిచ్చోడి చేతిలో ఒకపార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం. తమ స్వార్థ ప్రయోజనాల కోసం అమాయకులైన విద్యార్థుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న బీజేపీ నాయకులు’ అంటూ కేటీఆర్ [ట్వీట్](url) చేశారు. బండి సంజయ్‌ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, బండి సంజయ్ అరెస్టును సవాల్ చేస్తూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. పిచ్చోని చేతిలో రాయి ఉంటే.. వచ్చి పోయేటోళ్ళకే … Read more

    కవితపై తప్పుగా మాట్లాడ లేదు: బండి

    టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు.BRS ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. కవిత విషయంలో తప్పుగా మాట్లాడలేదని అన్నారు. తనెవరినీ కించపరచలేదని వెల్లడించారు. తెలంగాణలో వాడుకలో ఉన్న సామెతను మాత్రమే తాను ప్రస్తావించినట్లు చెప్పుకొచ్చారు. కాగా పేపర్ లీకేజీ కేసులో నిందుతురాలు రేణుక కుటుంబ సభ్యులు BRS నేతలేనని బండి సంజయ్‌ ఆరోపించారు. పేపర్‌ లీక్‌ కేసును సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

    LIVE: బండి సంజయ్ ప్రెస్‌మీట్

    కేసీఆర్ జాతీయ పార్టీపై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌కు సీఎంగా ఉండే అర్హత లేదని.. రాజీనామా చేసి BRSనుంచి పోటీ చేయాలని డిమాండ్ చేశారు. ఏ ఉద్దేశంతో పార్టీని స్థాపించారో చెప్పాలన్నారు. ఈ పార్టీకి జెండా లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు ఎంతో మంది టూరిస్టులు వస్తుంటారని.. ఇప్పుడు కేసీఆర్ పర్యాటకుడిగా మారారని విమర్శించారు. కుట్రలతోనే జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని కేసీఆర్ యత్నిస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు.

    బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత

    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తంగా మారింది. జనగామ జిల్లా దేవరుప్పలలో తెరాస, భాజపా శ్రేణులు పరస్పరం దాడి చేసుకున్నారు. దేవరుప్పల బహిరంగ సభలో మాట్లాడుతూ బండి సంజయ్‌ ఉద్యోగాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. దీంతో కేంద్రంలో ఏం ఉద్యోగాలు ఇచ్చారంటూ తెరాస కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగి దాడులకు దారితీసింది. పలువురికి గాయాలు కాగా, పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.