• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏపీని అమ్మేద్దామని చూస్తున్నారు: కన్నా

    ఏపీని కేసీఆర్‌కు జగన్ అమ్మేద్దామకుంన్నారని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. 2019 ఎన్నికల్లో జగన్‌ ప్రజల్ని మోసం చేసి గెలిచారని ఆరోపించారు. ప్రజలు మోసాన్ని గమనించారనే ఓటర్ల జాబితాలో మార్పులు చేసి గెలవాలని చూస్తున్నారన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఏపీ ఆస్తులు పోగొట్టారని చెప్పారు.. ఈ సారి రాష్ట్రాన్ని కేసీఆర్‌కు అమ్మేద్దామని చూస్తున్నారని కన్నా విమర్శించారు.

    జగన్ సిగ్గుతో తలదించుకోవాలి: లోకేష్

    జగన్‌ అసమర్థ పాలన రాష్ట్ర ప్రజలకు శాపమైందని టీడీపీ నేత లోకేష్ ఆరోపించారు. చెట్ల కింద రోగుల దుస్థితి.. జగన్ చేతగాని పాలనకు అద్దం పడుతోందన్నారు. గిరిజన తండాల ప్రజలకు అండగా ఉన్న ధర్మాస్పత్రిలో మూడేళ్లుగా చెట్లకిందే వైద్యసేవలు అందిస్తున్నారంటే జగన్ సిగ్గుతో తలదించుకోవాలంటూ మండిపడ్డారు. జగన్ దివాలా కోరు పాలన పుణ్యమా అని కర్నూలు, అనంతపురం వంటి బోధనాస్పత్రుల్లోనే దూది సైతం అందుబాటులో లేని దుస్థితి నెలకొందని లోకేష్ విమర్శించారు.

    బుద్దా వెంకన్నకు సీఐడీ నోటీసులు

    తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ బుద్దా వెంకన్నకు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. జడ్జిలను దూషించారన్న అభియోగాలపై ఆయనకు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం పలు ఆరోగ్య పరీక్షల కోసం బుద్దా వెంకన్న హైదరాబాద్‌లోనే ఉన్నారు. దీంతో హైదరాబాద్ వెళ్లిన సీఐడీ అధికారులు.. నేరుగా ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతోనే నోటీసులు ఇచ్చినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. వెంటనే వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కోరినట్లు చెప్పారు.

    ఆస్పత్రిలో చేరిన చంద్రబాబు

    HYD: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. హైదరాబాద్‌లోని AIG ఆస్పత్రిలో ఆయన చేరినట్లు సమాచారం. ఈ ఉదయమే వైద్య పరీక్షల కోసం ఆయన గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రికి వెళ్లారు. పరీక్షల అనంతరం చంద్రబాబు అక్కడే అడ్మిట్‌ అయినట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ఆయన వైద్యుల సంరక్షణలో ఒకరోజు పాటు ఉండే అవకాశం ఉంది.

    టీడీపీ మాజీ అధ్యక్షుడిపై కేసు

    తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌పై కేసు నమోదైంది. బంజారాహిల్స్‌ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్‌లోని టీడీపీ కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకొని దాడికి పాల్పడ్డారంటూ టీడీపీ నేత డాక్టర్‌ ఏ.ఎస్‌.రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యాలయంలోనికి వెళ్లకుండా కాసాని జ్ఞానేశ్వర్, సభ్యులు ప్రకాశ్‌ ముదిరాజ్, బిక్షపతి ముదిరాజ్, ప్రశాంత్‌ యాదవ్‌ తదితరులు తనపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిలో కుడికంటిపై గాయమైందని తెలిపారు.

    జైలు నుంచి చంద్రబాబు విడుదల

    రాజమహేంద్రవరం జైలు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు విడుదలయ్యారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో చంద్రబాబును జైలు నుంచి అధికారులు విడుదల చేశారు. చంద్రబాబు విడుదలతో టీడీటీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకుని చంద్రబాబుకు స్వాగతం పలికారు.

    నారా లోకేశ్‌పై ఆర్జీవీ సెటైర్లు

    AP: టీడీపీ నేత నారా లోకేశ్‌ తనపై చేసిన విమర్శలపై దర్శకుడు రాంగోపాల్‌ వర్మ సెటైర్లు వేశారు. లోకేశ్‌ను చూసి నవ్వాలా? జాలి పడలా? నవ్వాలా? ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు పరిస్థితి చూసి లోకేశ్‌ మైండ్‌ స్టబిలైజ్‌ అయ్యిందేమో అని విమర్శించారు. ఒకసారి డాక్టర్‌ను సంప్రదిస్తే మంచిదేమో అని సలహా ఇచ్చారు. సబ్జెట్‌ తెలియకుండా మాట్లాడితే మీ తండ్రిని దేవుడు కూడా కాపాడలేడని ఆర్జీవీ అన్నారు. కొద్ది రోజులు లండన్‌కు వెళ్లి రెస్ట్‌ తీసుకోవాలని లోకేశ్‌కు సూచించారు. Hey @NaraLokesh … Read more

    ‘ఆ పార్టీల పొత్తుతో రాజకీయ సునామీ’

    AP: జనసేన, తెదేపా కలయిక రాజకీయ సునామి సృష్టిస్తుందని మాజీ మంత్రి హరిరామజోగయ్య అన్నారు. రాబోయే పదేళ్ల కాలంలో ఏ రంగాల్లో లక్ష్యాన్ని నిర్ధారించుకోవాలో పవన్‌కు లేఖ ద్వారా సూచించినట్లు తెలిపారు. 1 నుంచి 10వ తరగతి వరకు ఉచిత విద్యతోపాటు రవాణా సౌకర్యం అందించాలని కోరానన్నారు. అలాగే కళాశాల విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉచిత పంట బీమా సౌకర్యం, మద్దతు ధర, వ్యవసాయ పెట్టుబడులకు ఏడాదికి రూ.20 వేల సాయం వంటి సూచనలు చేసినట్లు వివరించారు.

    89 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ?

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 89 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని టీడీపీ భావిస్తోంది. నియోజకవర్గాల వారిగా టికెట్ ఆశిస్తున్న వారిని ఎంపిక చేసింది. ఈ వివరాలతో కూడిన జాబితాను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ జైలులో ఉన్న చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గాలకు 189 మంది పేర్లతో జాబితా రూపొందించినట్లు విశ్వసనీయ సమాచారం.

    1న జనసేన-టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో

    AP: జనసేన, టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోను నవంబర్‌ 1న ప్రకటి­స్తా­మని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఆ తర్వాత ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తామన్నారు. మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు ఉండాలి? ఉమ్మడి పార్టీల ప్రాధాన్యత వంటి అంశాలు సమన్వయ కమిటీ భేటీలో చర్చకు వచ్చినట్లు చెప్పారు. జనసేన, టీడీపీ కలయిక కోసం ప్రజలు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. తాము వైసీపీకి కాదని ఆ పార్టీ విధానాలకే వ్యతిరేకమని పవన్‌ స్పష్టం చేశారు. వైసీపీ నేతలు మద్యంపై రూ.30 వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు.