పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించి అత్యాచారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఉపాధ్యాయుడి కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించి ఓ టీచర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆనేక సార్లు బెదిరించి తన పశువాంఛ తీర్చుకున్నాడు. చివరికి విద్యార్థిని గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దమ్మదూడెం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై పిచ్చయ్య అనే లెక్కల టీచర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తొలుత తల్లిదండ్రులకు పేరు చెప్పేందుకు జంకిన బాలిక.. చివరికి కీచకుడి దారుణాన్ని తల్లిదండ్రులకు వివరించింది.