• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రభుదేవా ‘వూల్ఫ్’ టీజర్ వచ్చేసింది

    ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా నటించిన ‘వూల్ఫ్’ మూవీ టీజర్ రిలీజైంది. ఈ సినిమా ప్రభుదేవాకు 60వ చిత్రం కావడం విశేషం. టీజర్‌ను బట్టి చూస్తే న్యాచురల్ హారర్ మూవీలా కనిపిస్తోంది. టీజర్‌ థ్రిల్లింగ్‌గా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాను విను వెంకటేశ్ తెరకెక్కించారు. కేథరీన్, రాయ్‌లక్ష్మీ, అనసూయ భరద్వాజ్‌లు కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. సందేశ్ నాగరాజ్, భూషణ్ కుమార్‌లు సంయుక్తంగా నిర్మించారు.

    ‘బ్రో’ టీజర్ వచ్చేసింది

    పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ స్టార్ సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘బ్రో’ మూవీ టీజర్ విడుదలైంది. ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ ఇవాళ రిలీజ్ చేశారు. పవన్, తేజ్ మధ్య వచ్చే డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ టీజర్ వైరల్‌గా మారింది. కాగా ఈ చిత్రంలో కేతికాశర్మ, ప్రియాప్రకాశ్ వారియర్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను సముద్రఖని డైరెక్ట్ చేశారు. జూలై 28న ఈ మూవీ విడుదల కానుంది.

    BHOLASHANKAR: షికారుకు వచ్చిన షేర్!

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘భోళాశంకర్’ మూవీ టీజర్ విడుదలైంది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న సంధ్య 70ఎంఎంలో టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో ‘షికారుకు వచ్చిన షేర్‌ను బే’ అంటూ చిరు మాస్ డైలాగ్స్ పలికాడు. యాక్షన్ సీన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. కాగా ఈ సినిమాలో చిరు సరసన తమన్నా హీరోయిన్‌గా నటించింది. మొహర్ రమేష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఆగష్టు 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ‘రంగబలి’ టీజర్ వచ్చేసింది!

    టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య హీరోగా, యుక్తి తరేజా హీరోయిన్‌గా తెరకెక్కిన ‘రంగబలి’ మూవీ టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌ను బట్టి చూస్తే పూర్తి కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. టీజర్ ఆకట్టుకునేలా ఉండడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. కాగా ఈ సినిమాకు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. చెరుకూరి సుధాకర్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 7న విడుదల చేయనున్నారు.

    థ్రిల్లింగ్‌గా ‘స్పై’ టీజర్!

    యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న ‘స్పై’ మూవీ టీజర్ విడుదలైంది. ఢిల్లీలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఈ సినిమా టీజర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా ఈ సినిమా తీసినట్లు తెలుస్తోంది. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. కాగా ఈ సినిమాతో గ్యారీ బీహెచ్ దర్శకుడిగా మారాడు. జూన్ 29న పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీని విడుదల చేయనున్నారు.

    ట్రెండింగ్‌లో ‘ఉస్తాద్’ టీజర్

    మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా కోడూరి హీరోగా తెరకెక్కిన ‘ఉస్తాద్’ టీజర్‌కు విశేష స్పందన లభిస్తోంది. ‘ఉస్తాద్’ టీజర్‌ యూట్యూబ్ ట్రెండింగ్స్‌లో నిలుస్తోంది. టీజర్ రిలీజైన ఒక్క రోజుకే 1 మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. కాగా ఈ మూవీలో శ్రీసింహా సరసన కావ్య కల్యాణ్‌రామ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఫణిదీప్ దర్శకత్వం వహించారు. వారాహి బ్యానర్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని మే 5న విడుదల చేయనున్నట్లు సమాచారం.

    ఆకట్టుకుంటున్న ‘వైరం’ టీజర్

    సీనియర్ నటుడు దేవరాజ్ తనయుడు ప్రణామ్ దేవరాజ్ ‘వైరం’ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. తెలుగు-కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని సాయి శివన్ జంపన తెరకెక్కించారు. జె.మల్లికార్జున ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. త్వరలో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నారు.

    ‘వినరో భాగ్యము విష్ణు కథ’ టీజర్ రిలీజ్

    టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మూవీ టీజర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. అల్లు అరవింద్ పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ విడుదల చేశారు. ఈ సినిమా తిరుమల తిరుపతి నేపథ్యంలో.. లవ్, కామెడీ, థ్రిల్లర్, సస్పెన్స్‌తో తెరకెక్కుతోంది. కిరణ్ సరసన కశ్మీర పర్దేశీ నటిస్తోంది. ఈ చిత్రానికి మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 17న విడుదల కానుంది.

    ఉత్కంఠగా ‘నేనే వస్తున్నా’ టీజర్

    తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘నేనే వస్తున్నా’ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ధనుష్ నటన అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ధనుష్ డ్యూయెల్ రోల్ పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. మూవీలో ధనుష్ అదిరిపోయే లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక టీజర్‌లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోరు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఈ చిత్రానికి సెల్వరాఘవన్ దర్శకత్వం వహిాంచారు. కలైపులిఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 22న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

    ఆది సాయికుమార్ ‘క్రేజీ ఫెలో’ టీజ‌ర్ రిలీజ్

    ఆది సాయికుమార్ హీరోగా న‌టించిన ‘క్రేజీ ఫెలో’ మూవీ టీజ‌ర్ రిలీజ్ అయింది. దిగంగ‌నా సూర్య‌వంశీ, మిర్నా ఇద్ద‌రూ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ క్రేజీ ల‌వ్‌స్టోరీకి ఫ‌ణి కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. టీజ‌ర్‌లో ఆది త‌న ఎన‌ర్జిటిక్ న‌ట‌న‌తో అల‌రించాడు. ఇటీవ‌ల చేసిన సీరియస్ పాత్ర‌ల‌కు విభిన్నంగా రొమాంటిక్ కుర్రాడి పాత్ర‌లో న‌టించాడు. ఈ చిత్రాన్ని శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహ‌న్ నిర్మిస్తున్నారు. అక్టోబ‌ర్ 14న మూవీ థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.