త్వరలో గ్రూప్-4 నోటిఫికేషన్: హరీశ్ రావు
తెలంగాణలో త్వరలో గ్రూప్-4 నోటిఫికేషన్ రాబోతోందని ఆర్థికమంత్రి హరీశ్ రావు తెలిపారు. గ్రూప్-4 పోస్టులు తెలంగాణలో సుమారు 10వేల ఖాళీలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 80వేల ఖాళీలు భర్తీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి దాకా ఆర్థికశాఖ నుంచి 52వేలకు పైగా ఉద్యోగాలకు అనుమతి లభించింది. ఇటీవల 1373 గ్రూప్ 3, 663 గ్రూప్ 2 పోస్టులకు అనుమతనిచ్చింది. తాజాగా త్వరలో గ్రూప్-4 నోటిఫికేషన్లు రాబోతున్నాయని హరీశ్ రావు ప్రకటించడం నిరుద్యోగులకు ఊరటనిస్తోంది.